Pfizer, Moderna and J&J vaccines: ఫైజర్, మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ల ఇంపోర్ట్‌పై కేంద్రం క్లారిటీ

Pfizer, Moderna and J&J vaccines imports: న్యూ ఢిల్లీ: విదేశాలకు చెందిన కొవిడ్-19 వ్యాక్సిన్ల ఇంపోర్ట్‌ ప్రక్రియను ఆలస్యం చేస్తూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఫైజర్, మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ల ఇంపోర్ట్‌పై ( importing Pfizer, Moderna and J&J vaccines) తాజాగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 28, 2021, 06:29 AM IST
Pfizer, Moderna and J&J vaccines: ఫైజర్, మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ల ఇంపోర్ట్‌పై కేంద్రం క్లారిటీ

Pfizer, Moderna and J&J vaccines imports: న్యూ ఢిల్లీ: విదేశాలకు చెందిన కొవిడ్-19 వ్యాక్సిన్ల ఇంపోర్ట్‌ ప్రక్రియను ఆలస్యం చేస్తూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఫైజర్, మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ల ఇంపోర్ట్‌పై ( importing Pfizer, Moderna and J&J vaccines) తాజాగా క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. ఆయా విదేశీ వ్యాక్సిన్ల దిగుమతులపై గత ఏడాది నుంచే ప్రక్రియ నడుస్తోందని తెలిపింది. వీలైనంత త్వరగా విదేశీ వ్యాక్సిన్లను ఇంపోర్ట్ చేసుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించిన కేంద్రం.. త్వరితగతిన విదేశీ వ్యాక్సిన్లను భారత్‌కి తెప్పించేందుకుగాను శాస్త్రీయంగా పేరొందిన విదేశీ వ్యాక్సిన్లకు భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ కూడా పక్కనపెట్టినట్టు కేంద్రం స్పష్టంచేసింది.  

విదేశీ వ్యాక్సిన్ల దిగుమతిలో జాప్యం జరుగుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించిన కేంద్రం.. ''అంతర్జాతీయ స్థాయిలో వ్యాక్సిన్లు కొనుగోలు చేయడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు'' అని అభిప్రాయపడింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA), యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (EMA), బ్రిటన్‌కి చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (UK's MHRA) జపాన్‌కి చెందిన ఫార్మాసుటికల్ అండ్ మెడికల్ డివైజెస్ ఏజెన్సీ (Japan's PMDA), వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO's COVID-19 vaccines list) వంటి సంస్థలు ఆమోదించిన కొవిడ్-19 వ్యాక్సిన్లను యుద్ద ప్రాతిపదికన భారత్‌కి తెప్పించేందుకు పలు ఆంక్షలను సైతం సడలించినట్టు కేంద్రం తేల్చిచెప్పింది. అందులో భాగంగానే ఆయా వ్యాక్సిన్లకు భారత్‌లో స్థానిక ట్రయల్స్ నుంచి సైతం మినహాయింపు ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. 

Also read: COVID-19 vaccine కి ముందు లేదా తర్వాత alcohol తీసుకోవచ్చా ? Side effects ఏంటి ?

ప్రస్తుతం భారత్‌కి కరోనా వ్యాక్సిన్ ఎగుమతి చేసేందుకు అవసరమైన అనుమతుల కోసం విదేశీ సంస్థలు పెట్టుకున్న అర్జీలు కూడా ఏవీ పెండింగ్‌లో లేవని కేంద్రం వివరణ ఇచ్చింది. భారత వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఉన్న అపోహలు - వాస్తవాలు (Myths & Facts on India's Vaccination Process) అనే శీర్షికతో విడుదల చేసిన ప్రకటనలో కేంద్రం ఈ అంశాలు పేర్కొంది.

Also read : Pfizer Vaccine: ఇండియా వేరియంట్‌పై ప్రభావం చూపుతున్న ఫైజర్ మరియు ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News