Singer Jai Srinivas died due to COVID-19: హైదరాబాద్: తెలంగాణకు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు జై శ్రీనివాస్ ఇక లేరు. ఇటీవలే కరోనా బారినపడిన జై శ్రీనివాస్.. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జై శ్రీనివాస్ అసలు పేరు నేరేడుకొమ్మ శ్రీనివాస్. అయితే, 'జై' సినిమాలో '' దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జండా మనదే అనే పాటతో జై శ్రీనివాస్‌కి గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆయన్ను సినీ పరిశ్రమలో నేరేడుకొమ్మ శ్రీనివాస్‌గా కాకుండా జై శ్రీనివాస్ అనే పేరుతోనే ప్రాచుర్యం పొందారు.
Also read: Sundarlal Bahuguna Dies: Covid-19తో చిప్కో ఉద్యమ నేత సుందర్‌లాల్ బహుగుణ కన్నుమూత
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు జై శ్రీనివాస్ పాటలు పాడి మెప్పించారు. అలాగే సినిమా పాటలతో పాటు ప్రైవేటు ఆల్బమ్‌లకు, షార్ట్ ఫిలింస్‌కు, వెబ్ సిరీస్‌లకు కూడా పాటలు పాడారు. జై శ్రీనివాస్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తన సంతాపం ప్రకటించారు. జై శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం జై శ్రీనివాస్ మృతిపై (Singer Jai Srinivas's death) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Also read : Krishnapatnam ayurvedic medicine: హైదరాబాద్‌కు కృష్ణపట్నం కరోనా ఆయుర్వేద మందు శాంపిల్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook