Delhi Weather: దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. రాజధాని నగరం చల్లబడింది. వేసవి ఎండలతో హీటెక్కిన ఢిల్లీ రోడ్లు సేద తీరుతున్నాయి. మే నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రత 16 డిగ్రీలకు పడిపోయింది.
అరేబియా సముద్రంలో(Arabian Sea) తుపాను ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా దేశ రాజదానిలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ (Delhi) నగరం కాస్త చల్లబడిపోయింది. మే నెలలో ఏకంగా ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల సెల్సియస్‌కు( Lowest temperature in Delhi) నమోదైంది. 70 ఏళ్ల చరిత్రలో మే నెలలో ఇంత స్వల్ప స్థాయికి ఉష్ణోగ్రత చేరడం ఇదే తొలిసారి. 1951లో మే నెలలో ఢిల్లీలో కనిష్టంగా 23.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆ డబ్బై ఏళ్ల రికార్డు ఇప్పుడు తౌక్టే తుపాను(Tauktae Cylone) కారణంగా చెరిగిపోయిందని ఐఎండీ (IMD)వెల్లడించింది. 1982 మే 13వ తేదీన 24.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కానీ ఇప్పుడు నమోదైన ఉష్ణోగ్రత 1951 కంటే తక్కువగా ఏకంగా 16 డిగ్రీలు నమోదైంది.
అటు వర్షపాతం కూడా ఢిల్లీలో రికార్డు స్థాయిలో నమోదైంది. తౌక్టే తుపాను కారణంగా ఢిల్లీలో 8.30 గంటలకు అత్యధికంగా 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా తౌక్టే తుపాను కారణంగా భారీ వర్షాలు( Heavy Rains) కురిశాయి. ఢిల్లీలో గత 35 ఏళ్ల తరువాత ఇవే అత్యధిక వర్షాలు. 1976లో మే నెలలో 24వ తేదీన ఢిల్లీలో 60 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణంగా అయితే మే నెలలో ఢిల్లీలో అత్యధికంగా అంటే 30-40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది.
Also read: Aerosols: ఏరోసోల్స్ పది మీటర్లు ప్రయాణిస్తాయిట..తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook