Singapore slams Arvind Kejriwal on Singapore strain: న్యూ ఢిల్లీ : సింగపూర్‌లో ప్రస్తుతం కరోనావైరస్‌కి చెందిన కొత్త స్ట్రెయిన్ వ్యాపిస్తోందని, అది చాలా డేంజరస్ వైరస్ అని, చిన్నారులపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సింగపూర్‌లో వేగంగా వ్యాపిస్తున్న ఈ కొత్త స్ట్రెయిన్ వల్ల భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ రావొచ్చని భారత ప్రభుత్వాన్ని హెచ్చరించిన కేజ్రీవాల్.. భారత్ - సింగపూర్ మధ్య విమానాల రాకపోకలు నిలిపేయాల్సిన అవసరం ఉందని సూచించారు. సరిగ్గా ఇదే విషయమై భారత్‌లో ఉన్న సింగపూర్ హై కమిషనర్ సైమన్ వాంగ్ తీవ్రంగా స్పందించారు.
సింగపూర్‌లో కొత్త స్ట్రెయిన్ అనేది ఓ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసిన సైమన్ వాంగ్.. సింగపూర్‌లో ఇలా ఫేక్ న్యూస్ వైరల్ చేసే వారిపై కేసు నమోదు చేసి శిక్ష విధించేందుకు 'ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆన్‌లైన్ ఫాల్స్‌హుడ్ అండ్ మ్యానిపులేషన్ యాక్ట్' (Protection from Online Falsehoods and Manipulation Act) అని ఓ చట్టం ఉందని, ఆ చట్టం ప్రకారం అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా కేసు నమోదు చేసే హక్కు సింగపూర్‌కి ఉంటుందని సైమన్ వాంగ్ హెచ్చరించారు.
Also read : Twin brothers died: కవల సోదరులు.. కలిసే పుట్టారు.. కలిసే పెరిగారు.. Corona తో కలిసే కన్నుమూశారు
ఇదిలావుంటే సింగపూర్ హై కమిషనర్ సైమన్ వాంగ్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) స్పందిస్తూ.. 'ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశం తరపున మాట్లాడలేదు' అని అన్నారు. 'తెలిసి, తెలియక చేసే నిర్లక్ష్యపు వ్యాఖ్యల వల్ల దేశాల మధ్య దీర్ఘకాల సంబంధాలు దెబ్బతింటాయి' అని జైశంకర్ అభిప్రాయపడ్డారు. కరోనా పోరులో భారత్‌కి సింగపూర్ మంచి భాగస్వామి అని కొనియాడిన జైశంకర్.. కష్టకాలంలో సింగపూర్ మన భారత్‌కి ఆక్సీజన్ పంపించి దేశానికి తోడుగా నిలిచిందని గుర్తుచేశారు.
ఇదిలావుంటే, మరోవైపు సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్ కూడా సోషల్ మీడియా ద్వారా అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సింగపూర్‌లో కరోనా న్యూ స్ట్రెయిన్ అనే ప్రచారంలో నిజం లేదని స్పష్టచేశారు.
Also read : PM Kisan Samman Nidhi Status: పీఎం కిసాన్ నగదు రూ.2000 రాలేదా, రైతులు ఇలా ఫిర్యాదు చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook