Telangana Lockdown: తెలంగాణ లాక్‌డౌన్‌పై సాయంత్రానికి నిర్ణయం

Telangana Lockdown: కరోనా పరిస్థితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానాలు సూచనలిస్తున్నాయి. ఒక్కోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ హైకోర్టు ..ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించింది. లాక్‌డౌన్‌పై స్పష్టత కోరింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 11, 2021, 12:37 PM IST
Telangana Lockdown: తెలంగాణ లాక్‌డౌన్‌పై సాయంత్రానికి నిర్ణయం

Telangana Lockdown: కరోనా పరిస్థితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానాలు సూచనలిస్తున్నాయి. ఒక్కోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ హైకోర్టు ..ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించింది. లాక్‌డౌన్‌పై స్పష్టత కోరింది.

కరోనా మహమ్మారి (Corona Virus) దేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. కరోనా కట్టడి కోసం చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్, నైట్‌కర్ఫ్యూ(NIght Curfew) లేదా కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. నిత్యావసరాలకు మినహాయింపు ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఏపీలో ఆరు గంటలు మినహా..18 గంటల కర్ఫ్యూ అమలవుతోంది. తెలంగాణలో మాత్రం కేవలం నైట్‌కర్ఫ్యూ మాత్రమే ఉంది. ఈ క్రమంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు(Telangana High Court) మరోసారి అత్యవసర విచారణ చేపట్టింది.

రాష్ట్రంలో కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు 9 (Covid 10 Tests) తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తే కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. మరోవైపు సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఎందుకు అడ్డుకుంటున్నారని కేసీఆర్ ప్రభుత్వాన్ని(Telangana government) ప్రశ్నించింది. పాతబస్తీలో కోవిడ్ నిబంధనలు ఎందుకు పాటించడం లేదో చెప్పాలని అడిగింది. ఇప్పుడైనా తెలంగాణలో లాక్‌డౌన్ విధిస్తారా లేదా నిబంధనలు కఠినంగా అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాలని కోరింది. కోర్టు సంధించిన ప్రశ్నలకు తెలంగాణ అడ్వకేట్ జనరల్ సమాధానమిచ్చారు. మద్యాహ్నం కేబినెట్ భేటీ ఉందని..అనంతరం లాక్‌డౌన్(Lockdown), కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు. తెలంగాణలో లాక్‌డౌన్(Telangana Lockdown) విధిస్తారా లేదా అనేది సాయంత్రానికి తేలిపోనుంది. 

Also read: సీఎం అయ్యే అర్హతలు Eetela Rajender, హరీష్‌ రావులకు మాత్రమే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News