Corona 3rd Wave Inevitable: సార్స్ (SARS-CoV2) వైరస్ మరింత పరివర్తన చెందుతున్నందున ప్రజలు కరోనా మూడో వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె విజయ్ రాఘవన్ హెచ్చరించారు. యూకే కొత్త వైరస్, డబుల్ మ్యూటెంట్ వంటి కరోనా వైరస్ కొత్త మార్పులపై సైతం కోవిడ్19 టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నా, త్వరలో మరిన్ని మార్పులు జరుగుతాయని, కరోనా మూడో వేవ్ రావడం తథ్యమని పేర్కొన్నారు.
ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె విజయ్ రాఘవన్ బుధవారం మీడియా సమావేశంలో పాల్గొని పలు విషయాలు వెల్లడించారు. ప్రజలు చాలా తక్కువగా కోవిడ్ నిబంధనలు పాటించడం, ప్రజలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న కారణంగా కరోనా సెకండ్ వేవ్‌కు పరిస్థితులు దారితీశాయని అభిప్రాయపడ్డారు. ఈ దశలో కరోనా కేసులతో పాటు కోవిడ్19(Covid-19) మరణాలు అసాధారణంగా పెరిగిపోయాయని, టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ వైరస్ విషయంలో కొత్త వ్యూహాలతో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Also Read: Health Tips: రాత్రివేళ ఈ ఆహార పదార్థాలు, Fruits తినకూడదు, అందుకు కారణాలు ఇవే
SARS-CoV2 వైరస్ 2019లో చైనాలోని వుహాన్‌లో పుట్టకొచ్చిందని, కానీ కేవలం జంతువులకే సోకుతుందని నిపుణులు భావించిన ఈ వైరస్ ప్రస్తుతం మనుషులలో సెకండ్ వేవ్‌కు దారితీసిందన్నారు. అక్టోబర్ 2020లో ప్రారంభమైన కరోనా(CoronaVirus) సెకండ్ వేవ్‌లో యూకే వేరియంట్, భారత్‌లోని వైరస్‌లో డబుల్ మ్యూటెంట్ సహా కొత్త వేరియంట్లు వచ్చాయన్నారు. కనుక రోగ నిరోధకశక్తి పెరిగా వైరస్‌లో మార్పుల కారణంగా రాబోయే రోజుల్లో కరోనాను ఎదుర్కోవడం అంత తేలిక కాదన్నారు. కరోనా థర్డ్ వేవ్ అనివార్యమని, కానీ ఈ దశను ఎదుర్కోవడం చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: PM Kisan Samman Nidhi: రైతులకు శుభవార్త, పీఎం కిసాన్ స్కీమ్ రూ.2000 త్వరలో ఖాతాల్లోకి
ఇన్‌ఫెక్షన్ పెరిగేకొద్దీ, వ్యాధి సోకిన వారిలో రోగనిరోధక శక్తిలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ క్రమంలో కరోనా తొలి దశ ముగిసిందని, కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్‌లో చాలా మార్పులు వచ్చాయన్నారు. కరోనా రెండో దశలో ప్రభావం తక్కువగా ఉంటుందని భావించాం కానీ, ఊహించిన దాని కన్నా పలు రెట్లు వ్యాపించి, ప్రాణనష్టం సైతం భారీగా జరిగిందన్నారు. కరోనా థర్ద్ వేవ్‌లో వైరస్ మహమ్మారిలో ఎలాంటి మార్పులొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తే మహమ్మారిపై విజయం సులభతరం అవుతుందన్నారు.
ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ సహా 12 రాష్ట్రాలలో 1 లక్షకు పైగా యాక్టివ్ కరోనా కేసులున్నాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ మరియు బిహార్ రాష్ట్రాలు సైతం భారీగా కేసులు నమోదు చేస్తుండటంతో సత్వరమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల హైకోర్టులు ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తున్నాయి.
Also Read: COVID-19 Vaccination: మీకు దగ్గర్లోని కోవిడ్19 టీకా కేంద్రాన్ని WhatsApp ద్వారా తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook