IPL 2021 Suspended : క్రికెట్ ప్రేమికులకు షాకింగ్ న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్ వాయిదా పడింది. ఇదివరకే నాలుగు జట్ల ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అన్ని ఫ్రాంచైజీలు ఐసోలేషన్‌కు వెళ్లిపోయాయి. ఐపీఎల్ 2021 నిరవధిక వాయిదా వేసినట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఈ మేరకు జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడుతూ సీజన్ తదుపరి మ్యాచ్‌లను వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు.
ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న జరగాల్సిన మ్యాచ్ వాయిదా వేశారు. ప్రస్తుతం నేటి మ్యాచ్‌పై సైతం నీలినీడలు కమ్ముకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ కరోనా కలకలం రేపింది. కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy), సందీప్ వారియర్లకు కరోనా పాజిటివ్ రావడంతో నిన్నటి మ్యాచ్ కొన్ని రోజులకు వాయిదా వేయడం తెలిసిందే. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సాహాకు కరోనా సోకింది. సన్‌రైజర్స్ యాజమాన్యం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
IPL suspended for this season: Vice-President BCCI Rajeev Shukla to ANI#COVID19 pic.twitter.com/K6VBK0W0WA
— ANI (@ANI) May 4, 2021
Also Read: IPL 2021: సందీప్ వారియర్ పర్లేదు, కానీ వరుణ్ చక్రవర్తిలో కరోనా లక్షణాలు
ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్సర్ అమిత్ మిశ్రాకు తాజాగా నిర్వహించిన టెస్టులలో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఢిల్లీ స్టేడియం సిబ్బందిలో కొందరికి కరోనా సోకినట్లు సమాచారం. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ సైతం కరోనా బారిన పడ్డారు. బయో బబుల్ వాతావరణంలో సురక్షితంగా మ్యాచ్‌లు నిర్వహిస్తున్నా, వరుస రోజుల్లో ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్ 2021(IPL 2021) తదుపరి మ్యాచ్‌ల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. గత ఏడాది యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించగా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోవడం గమనార్హం.
Also Read: Bill Gates Divorce: విడాకులు తీసుకుంటున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, మెలిండా
PIL filed in Bombay High Court seeking direction to Board of Control for Cricket in India (BCCI) to cancel or postpone IPL 2021 owing to COVID19 situation
The petitioner says the resources deployed for IPL players can be used for COVID19 patients pic.twitter.com/FBvG6dh2Qb
— ANI (@ANI) May 4, 2021
మరోవైపు బాంబే హైకోర్టులో ఐపీఎల్ 14 నిర్వహణపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఐపీఎల్ తాజా సీజన్‌ను రద్దు చేయడంగానీ, లేదా వాయిదా గానీ వేయాలని పిల్లో కోరారు. ఐపీఎల్ ఆటగాళ్లకు వెచ్చించే మొత్తాన్ని కరోనాపై పోరాటం కోసం ఖర్చు చేయాలని పిటిషనర్ తన పిల్ ద్వారా సూచించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి తాజా సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook