Karnataka: కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా కర్నాటకలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర రాజధాని బెంగళూరులో పరిస్థితి మరీ ఘోరంగా మారుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి(Corona virus) అతి భయంకరంగా విస్తరిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్, మరికొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్డౌన్, కర్ఫ్యూలు పెట్టినా ప్రయోజనం కన్పించడం లేదు. కర్నాటక ( Karnataka) లో లాకా్డౌన్(Lockdown)విధించినా ఇంకా పరిస్థితి అదుపులో రాలేదు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 37 వేల 733 కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. 217 మంది కరోనా కారణంగా మరణించారు. 21 వేల మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా రోగుల సంఖ్య 16 లక్షలకు చేరుకుంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా కారణంగా 16 వేలమంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4 లక్షల 21 వేల యాక్టివ్ కేసులున్నాయి.
ఇక ఒక్క బెంగళూరు(Bengaluru)నగరంలోనే గత 24 గంటల్లో 21 వేల 199 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కాగా 10 వేల మంది కోలుకుని డిశ్చార్జ్ అయితే..64 మంది మరణించారు. ఇప్పటివరకూ నగరంలో 7 లక్షల 97 వేల మందికి కరోనా సోకగా..ప్రస్తుతం 2 లక్షల 81 వేల యాక్టివ్ కేసులున్నాయి. బెంగళూరులో అత్యధికంగా 64 మంది మరణించగా..చామరాజనగరలో 15, తుంకూరులో 13, శివమొగ్గలో 12, మైసూరులో 8, హాసనలో 11 మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2 కోట్ల 59 లక్షల 33 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు ( Covid19 tests) చేశారు. అటు 98 లక్షల మందికి వ్యాక్సిన్ ( Corona vaccination) ఇచ్చారు.
Also read: West Bengal: పశ్చిమ బెంగాల్లో వామపక్షాల పతనానికి బీజం అప్పుడే పడిందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook