/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Covid 19 Treatment: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా 108, 104 సేవల్ని వినియోగించుకుని ఇంటి వద్దకే చికిత్స అందించే ఏర్పాటు చేస్తోంది.

కరోనా వైరస్ సెకండ్ వేవ్(Corona Second Wave) దేశాన్ని కుదిపేస్తోంది. రికార్డు స్థాయిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇటు ఏపీలో కూడా అదే పరిస్థితి. ప్రతిరోజూ 10-11 వేల కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం( Ap government) మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. కోవిడ్ 19(Covid19)ను సమర్ధంతంగా ఎదుర్కొనేందుకు 108,104 సేవల్ని మరింత విస్తృతంగా ఉపయోగిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో 104 కాల్‌సెంటర్‌లను బలోపేతం చేసి..ఫోన్ చేసిన వెంటనే వైద్య బృందాలు కోవిడ్ రోగులకు చికిత్స అందించేలా ప్రణాళిక అమలు చేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి మొన్నటి వరకూ రాష్ట్రంలో 104 ద్వారా 5 లక్షల 97 వేల 765 మందికి ఉచితంగా వైద్య సేవలందించారు. 5 లక్షల 67 వేలమందికి ఉచితంగా మందులు పంపిణీ చేసింది ప్రభుత్వం. 

ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల్నించి సాయంత్రం 4.30 వరకూ గ్రామంలో 104 అంబులెన్స్ (104 Ambulance) అందుబాటులో ఉంచి..వైద్య సేవలు ఇంటి వద్దే అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో కోవిడ్ రోగుల్ని తరలించేందుకు ప్రత్యేకంగా 108 ఆంబులెన్స్‌లు( 108 Ambulance) ఏర్పాటు చేసింది. నాన్ కోవిడ్ పేషెంట్లకు కేటాయించిన అంబులెన్స్‌లను కోవిడ్ పేషెంట్లకు వినియోగించిన తరువాత వాటిని పూర్తిస్థాయిలో శానిటైజ్ చేస్తున్నారు. తరువాత వైద్యులు ధృవీకరించిన అనంతరమే తిరిగి సాధారణ పేషెంట్ల కోసం వినియోగిస్తున్నారు.అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ 108 అంబులన్స్‌లలో పూర్తిగా నింపిన రెండు ఆక్సిజన్ సిలెండర్లు, వెంటిలేటర్, డెఫిబ్రిల్లేటర్ పరికరాల్ని అందుబాటులో ఉంచడమే కాకుండా సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చారు.

Also read: Tirupati Bypoll: తిరుపతి ఉపఎన్నిక రద్దుపై పిటీషన్లు కొట్టివేత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Ap government implementing Door to Door treatment for covid patients through 104 ambulance
News Source: 
Home Title: 

Covid 19 Treatment: ఏపీలో కరోనా కట్టడికి ఇంటి వద్దకే వైద్యం, ప్రతి గ్రామంలో 104

Covid 19 Treatment: ఏపీలో కరోనా కట్టడికి ఇంటి వద్దకే వైద్యం, ప్రతి గ్రామంలో 104 అంబులెన్స్
Caption: 
Ambulance ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Covid 19 Treatment: ఏపీలో కరోనా కట్టడికి ఇంటి వద్దకే వైద్యం, ప్రతి గ్రామంలో 104
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Saturday, May 1, 2021 - 14:14
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
71
Is Breaking News: 
No