Eatala Rajender's minister post: హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు 100 ఎకరాల భూమిని మంత్రి ఈటల రాజేందర్ కబ్జా (Land encroachments) చేశారనేది ఆయనపై వస్తున్న ఆరోపణలు. దాదాపు నాలుగున్నరేళ్ల కిందటే ఈ గోల్‌మాల్ జరిగిందని, ఇందులో మంత్రి ఈటల ప్రమేయం ఉందని నిర్ధారిస్తూ అప్పటి కలెక్టర్‌గా ఉన్న ధర్మారెడ్డి సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేశారని, ఆ ఫైలు ఆధారంగానే మంత్రి ఈటల రాజేందర్‌పై వేటుకు రంగం సిద్ధం అవుతోందనేది ఆ వార్తల సారాంశం.
ఇప్పుడే తెరపైకి రావడానికి కారణం ?
ఈటల రాజేందర్ కబ్జా చేసినట్టుగా చెబుతున్న భూమికి ఇటీవలే రోడ్డు వేసే విషయంలో కొంతమంది స్థానిక రైతులు వ్యతిరేకించిన నేపథ్యంలోనే ఈ కబ్జా (Land kabja) వ్యవహారం బయటకు పొక్కిందని, ఆ తర్వాతే సీఎం కేసీఆర్ అప్పటి జిల్లా కలెక్టర్ ధర్మా రెడ్డి సహాయంతో ఆ ఫైలు తెప్పించుకున్నారనేది మంత్రి ఈటల రాజేందర్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం. అందుకే ఇక మంత్రి ఈటల రాజేందర్ మాజీ మంత్రి అయ్యేందుకు ఎంతో దూరం లేదనేది ఆ ప్రచారం సారాంశం.
Also read : COVID-19 test నకిలీ రిపోర్ట్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
ఇదిలావుంటే, గతంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై వేటు వేయాల్సి వచ్చిన సందర్భంలోనూ తన ప్రభుత్వంపై, తన వైఖరిపై ఎన్ని విమర్శలు వచ్చినా సీఎం కేసీఆర్ లెక్కచేయలేదనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ (Minister Eetela Rajender) మంత్రి పదవిపై వస్తున్న వార్తలు మీడియాలో చర్చనియాంశమయ్యాయి.
Also read : Anchor Shyamala: తన భర్త నరసింహా రెడ్డిపై చీటింగ్ కేసులో వీడియో విడుదల చేసిన యాంకర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook