Madras High Court: కేంద్ర ఎన్నికల సంఘంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రమైన సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో ప్రమాదకర స్థితిలో ఉందని చెప్పిన హైకోర్టు..ఈసీ అధికారులపై మర్డర్ కేసులు పెట్టాలని వ్యాఖ్యానించింది. అసలేం జరిగింది..
దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) అత్యంత దారుణంగా మారింది.శరవేగంగా విస్తరిస్తూ..రోజుకు 3.5 లక్షల కేసులు నమోదవుతున్న పరిస్థితి. కరోనా మహమ్మారి ఇండియాలో ప్రమాదకర పరిస్థితిలో ఉందని మద్రాస్ హైకోర్టు (Madras High Court) వ్యాఖ్యానించింది. ప్రతిరోజూ 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, కుంభమేళా(Kumbhmela), ప్రజల నిర్లక్ష్యం కారణంగా కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయని తెలిపింది. కరోనా విపత్తు ముంచుకొస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతి ఇవ్వడమేంటని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరు వేరే గ్రహంలో ఉన్నారా అని ఈసీఐ కౌన్సిల్‌ను ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ వ్యాఖ్యానించారు.
తమిళనాడు ( Tamilnadu)లో గత 24 గంటల్లో 15 వేల 659 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షల 81 వేల 988 కు చేరుకుంది. ఒక్క చెన్నై (Chennai) నగరంలోనే గత 24 గంటల్లో 4 వేల 206 కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా రాష్ట్రంలో కలవరం కల్గిస్తున్నాయి.ఈ నేపధ్యంలో తమిళనాడులో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)కు ఎన్నికల కమీషనే ఏకైక కారణమని మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ (Election Commission) అధికారులపై మర్డర్ కేసులు పెట్టాలని సూచించింది. కరోనా కట్టడికి సరైన ప్రణాళిక లేకపోతే మే 2న విడుదలయ్యే ఫలితాల్ని నిలిపివేస్తామని హెచ్చరించింది. కౌంటింగ్ డేకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌పై ఏప్రిల్ 30న మరోసారి సమీక్ష జరపనున్నట్టు కోర్టు పేర్కొంది.
Also read: Free Vaccination: 18 ఏళ్లు పైబడినవారికి ఉచిత వ్యాక్సిన్ ఏయే రాష్ట్రాల్లో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook