Free COVID-19 vaccine in Telangana: హైదరాబాద్: కరోనా కట్టడికి తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ కొవిడ్-19 వాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించుకున్న సీఎం కేసీఆర్... ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కి, వైద్యశాఖ అధికారులకూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో వున్న ప్రతీ ఒక్కరికీ ఉచితంగా వాక్సినేషన్ పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ సూచించారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 35 వేల మంది వరకు కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine) తీసుకున్నారు. రాష్ట్రంలో స్థానికులు, స్థానికేతరులు కలిపి ఇంకా కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారి సంఖ్య మరో 3.5 కోట్లపై మాటే ఉంటుంది. వీళ్లందరికీ కరోనా వాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు 2500 కోట్ల రూపాయలకుపైనే ఖర్చు కానుందని, అయితే ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Also read : Oxygen supply ని అడ్డుకుంటే ఉరి తీస్తాం: Delhi High Court
భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారు చేస్తుండగా.. డా రెడ్డీస్ ల్యాబ్స్‌తో పాటు ఇంకొన్ని ఇతర సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయని సీఎం కేసీఆర్ (CM KCR) తెలిపారు. వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి.. రెండు-మూడు రోజుల్లో తాను పూర్తిగా కోలుకోగానే సంబంధిత ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి వాక్సినేషన్ (COVID-19 vaccination) కార్యక్రమాన్ని తానే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తానని స్పష్టంచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook