COVID-19: కరోనా వైరస్ ఎంత సమయంలో వ్యాపిస్తుందో తెలుసా, నిపుణులు ఏం చెప్పారంటే

Coronavirus Mutation | ప్రతిరోజూ 2 లక్షలకుపైగా కోవిడ్‌19 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వెయ్యికి పైగా మరణాలు 24 గంటల్లోనే సంభవించడం వైరస్‌ మార్పులను స్పష్టంగా సూచిస్తుంది. కరోనా వ్యాప్తి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 18, 2021, 10:19 AM IST
COVID-19: కరోనా వైరస్ ఎంత సమయంలో వ్యాపిస్తుందో తెలుసా, నిపుణులు ఏం చెప్పారంటే

Coronavirus Mutation | కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లో విజృంభిస్తోంది. ప్రతిరోజూ 2 లక్షలకుపైగా కోవిడ్‌19 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వెయ్యికి పైగా మరణాలు 24 గంటల్లోనే సంభవించడం వైరస్‌ మార్పులను స్పష్టంగా సూచిస్తుంది. ఈ కారణంగానే విదేశీ వ్యాక్సిన్లను తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 

దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 14 లక్షలు దాటిపోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చి కరోనా బారిన పడకూడదని వైద్యశాఖ నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రయోజనం కనిపించడంలేదు. ఓవైపు కరోనా వైరస్‌ ఎలా పుట్టుకొచ్చిందన్న అధ్యయనాలు కొనసాగుతుండగా, మరోవైపు కోవిడ్‌19 మహమ్మారి తన రూపాన్ని మార్చుకుంటోంది. కొత్త లక్షణాలతో వస్తోంది. ఆ కారణంగానే ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలు కరోనాను జయించలేకపోతున్నారు. 

Also Read: Face Mask Mistakes: ముఖానికి మాస్క్ ధరిస్తున్నారా, అయితే ఈ పొరపాట్లు మాత్రం చేయవద్దు

బీఎల్కే సూపర్‌​స్పెషాలిటీ హాస్పిటల్‌ డాక్టర్‌ సందీప్‌ నాయర్‌ తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా వ్యాప్తి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘కరోనా వైరస్‌ అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది. కేవలం ఒక్క నిమిషం వ్యవధిలోనే ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. గతంలో కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడానికి 10 నిమిషాలు పట్టేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని, వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. కుటుంబంలో ఒకరికి కోవిడ్19 పాజిటివ్ అని తేలితే, ఇతర కుటుంబసభ్యులు ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ వారు సైతం కరోనా బారిన పడుతున్నారని’ వివరించారు.

Also Read: Oxygen cylinders suppliers contacts: ఆక్సీజన్ సిలిండర్స్ కావాలా ? ఆక్సీజన్ సరఫరాదారుల డీటేల్స్ ఇదిగో 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News