COVID19 Positive Cases: భారతదేశంలో కరోనా మహమ్మారి రికార్డులు తిరగరాస్తోంది. గతంలో ఎన్నడూ లేదనంగా దేశంలో గడిచిన 24 గంటల్లో భారీగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో తాజాగా 1,52,879 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తొలిసారిగా ఒకరోజులో లక్షన్నర కేసులను భారత్ నమోదు చేయగడం గమనార్హం.
తాజాగా కేసులతో కలిపితే దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,33,58,805కు చేరింది. అదే సమయంలో గడిచిన 24 గంటలలో 839 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. భారత్‌లో ఇప్పటివరకూ కోవిడ్19 మహమ్మారి బారిన పడి 1,69,275 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 11,08,087 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. కరోనా వైరస్(CoronaVirus) బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,20,81,443గా ఉంది. శనివారం ఒక్కరోజులో 14,12,047 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారని ఐసీఎంఆర్ తెలిపింది.
Also Read; Telangana COVID-19 Cases: తెలంగాణలో తాజాగా 3000 దాటిన కరోనా పాజిటివ్ కేసులు
నేటి నుంచి దేశ వ్యాప్తంగా టీకా ఉత్సవ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 14వ తేదీవరకు మూడు రోజులపాటు టీకా ఉత్సవ్ నిర్వహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి నుంచి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి వరకు దేశ వ్యాప్తంగా టీకా ఉత్సవ్ ఘనంగా నిర్వహించాలని, సాధ్యమైనంత మందికి కోవిడ్19(Covid-19) టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టీకా మోతాదుల కొరత ఉందని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నాయి. అమెరికా, బ్రెజిల్ తరువాత కరోనా తీవ్రత అధికంగా ఎదుర్కొంటున్న మూడో దేశంగా భారత్ నిలిచింది.
కాగా, జనవరి 16న దేశంలో తొలి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి దశ కరోనా టీకాల పంపిణీలో పారిశుధ్య, ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాలు ఇచ్చారు. ఆపై ఫిబ్రవరిలో రెండో దశలో కరోనా టీకాలు అరవై ఏళ్లు పైబడిన వారికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలుపెట్టారు. ఆపై ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా కరోనా టీకాల పంపిణీలో జాప్యం, చాలినన్ని వ్యాక్సిన్ మోతాదులు కేంద్రం నుంచి అందడం లేదని పలు రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించాయి. 58 దేశాలకు టీకాలు పంపిణీ చేశాం, మన దేశంలో టీకాలు అందుబాటులో ఉంచడం తమకు సమస్య కాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook