Eating watermelon: ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన పుచ్చకాయ, ఎలుకల మందు

Half-eaten watermelon eaten by rats: పెద్దపల్లి: ఎలుకల మందు తిన్న ఎలుకలు పుచ్చకాయను తినగా, ఆ విషయం గుర్తించకుండా ఆ పుచ్చకాయను తిని ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం విస్సంపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే ఘటనలో పుచ్చకాయ తిని తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారుల తల్లిదండ్రులతోపాటు, వారి నానమ్మ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2021, 01:50 AM IST
  • ఎలుకలు తిన్న పుచ్చకాయ తిని ఆస్పత్రిపాలైన కుటుంబం.
  • ఇద్దరు కొడుకులు ప్రాణాలు కోల్పోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిదండ్రులు, నానమ్మ.
  • ఎలుకల కోసం పెట్టిన ఎలుకల మందే వారి పాలిట శాపం
Eating watermelon: ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన పుచ్చకాయ, ఎలుకల మందు

Half-eaten watermelon eaten by rats: పెద్దపల్లి: ఎలుకల మందు తిన్న ఎలుకలు పుచ్చకాయను తినగా, ఆ విషయం గుర్తించకుండా ఆ పుచ్చకాయను తిని ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం విస్సంపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే ఘటనలో పుచ్చకాయ తిని తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారుల తల్లిదండ్రులతోపాటు, వారి నానమ్మ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విస్సంపేటకు చెందిన దారబోయిన శ్రీశైలం, గుణవతి దంపతులకు శివానంద్‌ ‌(12), శరణ్ (10) ఇద్దరు సంతానం. విస్సంపేటకు సమీపంలోని మూర్మూర్‌‌లో శివానంద్‌‌ 4వ తరగతి, శరణ్ 3వ తరగతి చదువుతున్నారు. 

ఇదిలావుండగా, గత నెల 30న శ్రీశైలం పుచ్చకాయ (Watermelon) కొనుక్కొచ్చాడు. సగం పుచ్చకాయ తిన్న కుటుంబసభ్యులు మిగతా సగం ఇంట్లో ఫ్రిజ్​ లేకపోవడంతో అన్ని కూరగాయలతో పాటే ఓ పక్కన పెట్టారు. ఇంట్లో ఎలుకలు బెడద ఎక్కువగా ఉందని వాటిని చంపేందుకు ఇంట్లోనే అక్కడక్కడ ఎలుకల మందు చల్లారు. ఆ ఎలుకల మందు తిన్న ఎలుకలు (Rats) సగం కోసిన పుచ్చకాయను కూడా తిన్నాయి. అయితే, ఈ విషయం గ్రహించని శ్రీశైలం కుటుంబసభ్యులు మంగళవారం రాత్రి మిగిలిన పుచ్చకాయను తినడం ఊహించని విషాదానికి దారితీసింది. 

Also read : Covid19 Update: ఏపీలో పెరుగుతున్న కరోనా వైరస్ కొత్త కేసులు, పరీక్షలు ముమ్మరం

మందు తిన్న ఎలుకలు తిన్న పుచ్చకాయను తిని తీవ్ర అస్వస్థతకు గురైన వారిని బుధవారం కరీంనగర్‌‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచే అక్కడే చికిత్స పొందుతున్న శివానంద్‌‌, చరణ్ శుక్రవారం ఉదయం మృతిచెందారు. శ్రీశైలం, గుణవతి, నానమ్మ సారమ్మల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓవైపు తల్లిదండ్రులు ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరోవైపు పిల్లలు ఇద్దరూ (Kids died) మృతి చెందిన తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News