COVID-19 Positive Cases: తెలంగాణలో ఒక్కరోజే 965 కోవిడ్-19 పాజిటివ్ కేసులు

Telangana CoronaVirus Cases | త కొన్ని రోజులు కరోనా కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో తాజాగా 965 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,741కు చేరింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 2, 2021, 11:55 AM IST
  • తెలంగాణలో కోవిడ్19 పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి
  • తాజాగా నిన్న ఒక్కరోజులో రాష్ట్రంలో 965 పాజిటివ్ కేసులు నమోదు
  • రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,741కు చేరింది
COVID-19 Positive Cases: తెలంగాణలో ఒక్కరోజే 965 కోవిడ్-19 పాజిటివ్ కేసులు

COVID-19 Positive Cases: తెలంగాణలో కోవిడ్19 పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులు కరోనా కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో తాజాగా 965 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,741కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

తెలంగాణలో గురువారం రాత్రి 8 గంటల వరకు 59,343 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో తొమ్మిది వందల అరవై అయిదు మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 9 వేల 7 వందల నలభై ఒకటికి చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ నిన్న మరో అయిదుగురు వ్యక్తులు చనిపోయారు. తాజా మరణాలతో కలిపితే తెలంగాణ(Telangana)లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,706కి చేరింది.

Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, వెండి ధరలు పైపైకి

గత కొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కన్నా రెట్టింపు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లోనూ కరోనా భయాందోళన పెరుగుతోంది. గురువాం ఒక్కరోజు 312 మంది చికిత్స అనంతరం కోవిడ్-19(COVID-19 Vaccination) నుంచి కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,01,876 మంది కరోనా మహమ్మారిని జయించారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రత అధికం అవుతుంది.  కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో జీహెచ్ఎంసీ(GHMC)లోనే ఏకంగా 254 కరోనా కేసులు నమోదు కావడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో కరోనా సెకండ్ సేవ్ కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 2,622 మంది చికిత్స పొందుతున్నారు.

Also Read: COVID-19 Vaccination: కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇది చదవండి, సులువైన విధానం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News