దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాలతో ముగిసింది. మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు దారుణంగా పడిపోయాయి.
ప్రస్తుతం సెన్సెక్స్ 309.59 పాయింట్ల నష్టంతో 34.757.16 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 94.05పాయింట్లకు పడిపోయి 10,666.55 వద్ద కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 527.75 పాయింట్ల నష్టంతో 34,539 నమోదు చేయగా, నిఫ్టీ 166.40 పాయింట్లు క్షీణించి 10,594.20 వద్ద ట్రేడయింది. హెచ్ డీ ఎఫ్ సీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, ఆదానీ పోర్ట్స్ తదితర షేర్లు నష్టపోయాయి.
ఇదిలా ఉండగా నేడు రూపాయి విలువ 14 పైసలు తగ్గి రూ.64.20/డాలర్ వద్ద ముగిసింది. శుక్రవారం రూపాయి విలువ రూ. 64.06/డాలర్ గా ఉంది.