Maganti Ramji Passed Away: టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు తనయుడు రాంజీ కన్నుమూత

Maganti Babu Son Maganti Ramji Death News: మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ(37) మృతిచెందారు. వైద్యుల చేసిన యత్నాలు ఫలించకపోవడంతో ఆదివారం రాత్రి మాగంటి రాంజీ(Maganti Ramji Passed Away) చనిపోయారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 8, 2021, 11:10 AM IST
  • టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ కన్నుమూత
  • విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన రాంజీ
  • నేడు ఏలూరులోని మాగంటి బాబు నివాసానికి రాంజీ భౌతికకాయం తరలింపు
Maganti Ramji Passed Away: టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు తనయుడు రాంజీ కన్నుమూత

Maganti Ramji Passed Away: టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ(37) మృతిచెందారు. మాగంటి బాబు తనయుడు రాంజీ ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో మాగంటి రాంజీని ఇటీవల విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల చేసిన యత్నాలు ఫలించలేదు. ఆదివారం రాత్రి మాగంటి రాంజీ(Maganti Ramji Passed Away) చనిపోయారు.

నేటి ఉదయం ఏలూరులోని మాగంటి బాబు నివాసానికి రాంజీ భౌతికకాయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. టీడీపీ(TDP) మాజీ ఎంపీ మాగంటి బాబు(Maganti Babu) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నా, రాంజీ ఫ్యామిలీ పెద్ద మనసుతో కీలక నిర్ణయం తీసుకుంది. మాగంటి రాంజీ అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. పెను విషాదంలోనూ మరికొందరికి సహాయ పడాలని మాగంటి బాబు కుటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Womens Day 2021 Wishes: నారీమణులకు వుమెన్స్ డే విషెస్ ఇలా తెలపండి

కాగా, మాగంటి రాంజీ ఆరోగ్య పరిస్థితి ఏంటన్నది తెలియరాలేదు. ఆయనకు ఏ అనారోగ్య సమస్య వచ్చింది, చిన్న వయసులోనే అంత పెద్ద సమస్య ఏమిటా అని తెలుగు తమ్ముళ్లు ఆలోచనలో పడ్డారు. యువనేత మాగంటి రాంజీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేసేవారు. కొన్ని రోజుల కిందట సైతం రాంజీ టీడీపీ కార్యకర్తలకు టచ్‌లోనే ఉన్నారు. కానీ ఆయనకు ఏ సమస్య ఉందనేది వారికి సైతం తెలియకపోవటం గమనార్హం.

Also Read: Google Doodle: మహిళా మహారాణులకు Womens Day 2021 శుభాకాంక్షలు తెలిపిన గూగుల్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News