COVID-19 Vaccine: 5 లక్షల కరోనా మరణాలు, Johnson & Johnson Single Shot కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి

Johnson & Johnson COVID-19 Vaccine: ఇతర దేశాలోనూ కరోనా ప్రభావం ఉన్నప్పటికీ, రికార్డు స్థాయిలో అమెరికాలో 5 లక్షలకు పైగా కోవిడ్-19(COVID-19) మరణాలు సంభవించాయి. జాన్సన్ అండ్ జాన్సన్ COVID-19 Vaccine అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 28, 2021, 09:47 AM IST
COVID-19 Vaccine: 5 లక్షల కరోనా మరణాలు, Johnson & Johnson Single Shot కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి

Johnson & Johnson COVID-19 Vaccine: అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ మహమ్మారి ముప్పుతిప్పలు పెడుతోంది. ఇతర దేశాలోనూ కరోనా ప్రభావం ఉన్నప్పటికీ, రికార్డు స్థాయిలో అమెరికాలో 5 లక్షలకు పైగా కోవిడ్-19(COVID-19) మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో అత్యవసర వినియోగం కోసం జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్‌ను అమెరికా అనుమతి ఇచ్చింది.

గతంలోనే రెండు కరోనా వ్యాక్సిన్లు అమెరికాలో ఆమోదం పొందాయి. అయితే తాజాగా ఆమోదం పొందిన జాన్సన్ అండ్ జాన్సన్ కోవిడ్-19 వ్యాక్సిన్ (COVID-19 Vaccine) మాత్రం ఒక్క డోసు ఇస్తే చాలు అని అమెరికా వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో సింగిల్ డోస్ వ్యాక్సిన్ జాన్సన్ అండ్ జాన్సన్‌కు ఆమోదం తెలిపినట్లు ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేర్కొంది. 

Also Read: Corona Vaccine: కరోనా విజేతలపై ఆసక్తికర విషయం, COVID-19 Vaccine ఒక్క డోసు ఇస్తే చాలు

‘అమెరికా ప్రజలకు శుభవార్త తెలియజేస్తున్నాం. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా అద్భుతంగా పనిచేసే టీకా(Corona Vaccine)కు ఆమోదం లభించింది. జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా టీకా ఇతర టీకాలకు భిన్నమైనది. ఇతర టీకాలు రెండు డోసులు ఇవ్వాల్సి ఉండగా, ఈ టీకా ఒక్క డోసు ఇస్తే చాలు. కరోనాపై పోరాటంలో మరో కీలక అడుగు వేశామని’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశ పౌరులలో నమ్మకాన్ని పెంచే వ్యాఖ్యలు చేశారు.

Also Read: Effect Of COVID-19 Vaccine: కరోనా టీకాల ప్రభావం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే

జాన్సన్ అండ్ జాన్సన్‌పై ఎలాంటి అపోహలు అక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో జరిపిన ట్రయల్స్‌లో 85.9 శాతం, బ్రెజిల్‌లో 87.6 శాతం, దక్షిణాఫ్రికాలో 81 శాతం మంది వాలంటీర్లలో సత్ఫలితాలను ఈ వ్యాక్సిన్ రాబట్టినట్లు వెల్లడించారు. అమెరికా పౌరులలో త్వరగా రోగనిరోధక శక్తిని పెంచడం, కరోనా మరణాలు నియంత్రించడంలో భాగంగా జే అండ్ జే వ్యాక్సిన్‌ను తీసుకొస్తున్నామని భరోసా కల్పించారు.

Also Read: COVID-19 Vaccine: కరోనా టీకా తీసుకున్నా.. వీరికి అంతగా పనిచేయదు

ఇదివరకే అమెరికాలో మోడెర్నా టీకాలు, ఫైజర్ వ్యాక్సిన్‌లు తాత్కాలిక ఆమోదం పొందడం తెలిసిందే. ఇప్పటివరకూ దాదాపు 65 మిలియన్ల అమెరికా వాసులకు టీకాలు ఇచ్చారు. జూన్ నాటికి 100 మిలియన్ల మందికి కరోనా టీకాలు ఇచ్చే దిశగా జో బైడెన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News