YS Sharmila new party in Telangana: తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం కృషి చేస్తానని ప్రకటించి, అవసరమైతే కొత్త పార్టీ ఏర్పాటుకైనా సిద్ధమేనని రంగంలోకి దిగిన YS Sharmila వెనుకున్నది టీఆర్ఎస్, బీజేపి పార్టీలేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే Jagga Reddy ఆరోపించారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అధినేత CM KCR తో పాటు MIM పార్టీలు రెండూ బీజేపి డైరెక్షన్లోనే నడుస్తున్నాయని ఆరోపించిన జగ్గా రెడ్డి... కొత్తగా ఆ జాబితాలో వచ్చి చేరిన ఈ మూడో మనిషే వైఎస్ షర్మిల అని అన్నారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లను క్యాష్ చేసుకునేందుకు.. తెలంగాణలో YS Rajasekhar Reddy కి ఉన్న పేరును వాడుకుని ఆమెను ప్రయోగిస్తున్నారని.. ఇందులో ఎటువంటి సందేహం లేదని జగ్గా రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పోల్ అయ్యే ఓట్లను చీల్చి, కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కకుండా చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే వైఎస్ షర్మిలను ఇలా రంగంలోకి దింపారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతానని వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి జగ్గా రెడ్డి మాట్లాడుతూ.. YS Sharmila నిజంగా తన తండ్రి YSR ఆశయాల సాధన కోసమే తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి చూపినట్టయితే.. అదే వైఎస్ఆర్ బిడ్డగా.. వైఎస్ఆర్ ఏ ఆశయాల కోసమైతే పనిచేశారో అదే ఆశయాల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీతో జత కట్టాలని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం వై.ఎస్.ఆర్ కృషి చేసే వారని.. అందుకే అదే ఆశయం కోసం పనిచేస్తున్న Congress party తో కలిసి పనిచేయాలని Jagga Reddy డిమాండ్ చేశారు.
Also read : Ys Sharmila meeting: అన్నాచెల్లెళ్ల మధ్య విబేధాలున్నాయా...షర్మిల సమావేశం దేనికి సంకేతం
ఇదిలావుంటే మరోవైపు మంత్రి హరీష్ రావు సైతం వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ''తెలంగాణ గురించి ఎటువంటి అవగాహన, పరిజ్ఞానం లేని వాళ్లు తెలంగాణలో పరిపాలన గురించి మాట్లాడుతున్నారు'' అని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఏ దిక్కు, మొక్కూ లేని వాళ్లు కూడా విమర్శలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు.. '' అలా ఎక్కడి నుంచో వచ్చి ప్రశ్నించే వాళ్లంతా మొసలి కన్నీరు కార్చేవారే'' అని అభిప్రాయపడ్డారు.
Also read : YS Sharmila's new party: వైఎస్ షర్మిల ప్రకటనపై మంత్రి Harish Rao కౌంటర్
తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి మంత్రి Harish Rao, కాంగ్రెస్ పార్టీ నుంచి MLA Jagga Reddy చేసిన ఈ వ్యాఖ్యలను YS Sharmila ఎలా తిప్పికొట్టనున్నారో వేచిచూడాల్సిందే మరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook