ఉద్యోగులు కంపెనీ మారే సందర్భంలో ఎదుర్కొనే సమస్యల్లో ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలోని డబ్బులను విత్ డ్రా చేసుకోవడం ఒకటి. కొత్త సంస్థకు ఉద్యోగులు పీఎఫ్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కచ్చితంగా పాత కంపెనీలో చివరి తేదీ (డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేక క్లోజింగ్ డేట్) నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో గతంలో పనిచేసిన సంస్థనే డేట్ ఆఫ్ ఎగ్జిట్ వివరాలు అప్ డేట్ చేయాల్సి ఉంటుంది.
EPFO Latest News: ఉద్యోగులు కంపెనీ మారే సందర్భంలో ఎదుర్కొనే సమస్యల్లో ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలోని డబ్బులను విత్ డ్రా చేసుకోవడం ఒకటి. కొత్త సంస్థకు ఉద్యోగులు పీఎఫ్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కచ్చితంగా పాత కంపెనీలో చివరి తేదీ (డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేక క్లోజింగ్ డేట్) నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో గతంలో పనిచేసిన సంస్థనే డేట్ ఆఫ్ ఎగ్జిట్ వివరాలు అప్ డేట్ చేయాల్సి ఉంటుంది.
కొన్ని సంస్థలు ఆ తేదీని ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో అప్డేట్ చేయకపోవడంతో ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO) శుభవార్త చెప్పింది. ఇకనుంచి ఉద్యోగులు కంపెనీ మారుతున్న సమస్యంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. జాబ్ మానేసిన ఉద్యోగులే సొంతంగా వారే పాత కంపెనీ ఎగ్జిట్ డేట్‌ను EPFO వెబ్సైట్లో అప్డేట్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. Also Read: EPFO ఖాతాల్లో 8.5 శాతం వడ్డీ జమ, EPF Passbook Password మరిచిపోతే ఇలా చేయండి
పాత కంపెనీలో జాబ్ మానేసి వెళ్లిపోయిన రెండు నెలల తర్వాతే ఎగ్జిట్ డేట్ వివరాలు ఆప్డేట్ చేసుకోవడం సాధ్యం అవుతుంది. గతంలో పనిచేసిన కంపెనీ చివరి పీఎఫ్ ఉద్యోగుల ఖాతా(PF Account)లో జమ చేసిన రెండు నెలలకు ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. Also Read: EPF Wage Ceiling: ఈపీఎఫ్ పరిమితి రూ.15,000 నుంచి రూ.21,000కు పెంచే యోచనలో ప్రభుత్వం
ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో ఉద్యోగులు డేట్ ఆఫ్ ఎగ్జిట్ కింది విధంగా చేసుకోవచ్చు(How To Update EPFO Exit Date) 1) ఉద్యోగులు https://www.epfindia.gov.in/ వెబ్సైట్లో తమ యూఏఎన్ నంబర్ (UAN Number), పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. -2) ‘మేనేజ్’ ఆప్షన్లో కనిపించే ‘మార్క్ ఎగ్జిట్’ (Mark Exit) మీద క్లిక్ చేయాలి.
3) సెలక్ట్ ఎంప్లాయ్మెంట్ డ్రాప్ డౌన్ నుంచి ఫీఎఫ్ అకౌంట్ నెంబర్‌ను సెలక్ట్ చేయాలి 4) గతంలో పనిచేసిన కంపెనీలో జాబ్ మానేయడానిక గల కారణాన్ని, డేట్ ఆఫ్ ఎగ్జిట్ (పాత కంపెనీలో చివరి వర్కింగ్ డేట్)ను నమోదు చేయాలి.
5) వివరాలు నమోదు చేసిన తర్వాత ‘రిక్వెస్ట్ ఓటీపీ’ మీద క్లిక్ చేస్తే ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని చెక్ బాక్స్‌లో నింపి అప్డేట్ చేయాలి. 6) ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే క్లోజింగ్ డేట్ (Date Of Exit) ప్రక్రియ పూర్తవుతుంది. Also Read: PF Balance Missed Call Number: పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోవచ్చు.. ఒక్క మిస్డ్ కాల్ చాలు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తమ ఈపీఎఫ్ ఖాతాదారులకు సరికొత్త సదుపాయాన్ని కల్పించింది. జాబ్ మానేసిన ఉద్యోగులే సొంతంగా వారే పాత కంపెనీ ఎగ్జిట్ డేట్‌ను EPFO వెబ్సైట్లో అప్డేట్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది.