SBI Alert: Update PAN Card To Use Debit Card For International Transactions: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఖాతా ఉందా. మీరు డెబిట్ కార్డుతో లావాదేవీలు చేస్తున్నారా. అయితే ఈ విషయాలు తెలుసుకోండి. మీరు డెబిట్ కార్డుతో అంతరాయం లేకుండా అంతర్జాతీయ లావాదేవీలను కొనసాగించాలనుకుంటే, మీ బ్యాంకు ఖాతాతో మీ పాన్(PAN) నంబర్‌ను అప్డేట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని స్వయంగా ఎస్బీఐ పేర్కొంది.
మీ పాన్ నంబర్‌ను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఈ పని కోసం ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదని ఎస్బీఐ తెలిపింది. బ్యాంక్ ఖాతాతో పాన్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవడం ఆఫ్లైన్లోనూ చేసుకోవచ్చు. దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ(SBI)కి దేశవ్యాప్తంగా 40 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా 22 వేలకు పైగా శాఖలను కలిగి ఉంది.
Also Read: IRCTC: రైలు టికెట్లపై 10 శాతం డిస్కౌంట్.. ఎలాగో తెలుసా!
ఎస్బీఐ అకౌంట్‌కు పాన్ కార్డ్ రిజిస్టర్ చేసే విధానం ఇదే..
1. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ అవ్వండి, ఈ-సర్వీస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
2. పాన్ రిజిస్ట్రేషన్ కోసం ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
3. పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి, మీ ఖాతా వివరాలు తెరపై కనిపిస్తాయి.
4. 'Click here to register' ఆప్షన్ క్లిక్ చేయండి
5. ఏ అకౌంట్‌కు పాన్(PAN) లింక్ చేయాలో దానిని క్లిక్ చేయాలి.
6. దీని తరువాత, మీరు పాన్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేసి, సబ్మిట్ చేస్తే ఒక పేజీ తెరుచుకుంటుంది.
7. ఆ స్క్రీన్ మీద మీ పేరు, CIF మరియు పాన్ నంబర్ కనిపిస్తాయి. వివరాలు చెక్ చేసి కన్ఫార్మ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
8. కన్ఫార్మ్ క్లిక్ చేశాక.. వెరిఫికేషన్ కోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు హై సెక్యూరిటీ కోడ్ అందుతుంది. దాన్ని ఎంటర్ చేసి కన్ఫార్మ్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
9. ఆ తరువాత మీ స్క్రీన్‌పై మీ రిక్వెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి.
10. బ్యాంక్ మీ రిక్వెస్ట్‌ను 7 రోజుల్లో ప్రాసెస్ చేస్తుంది.
Also Read: Singareni Jobs: సింగరేణిలో 372 పోస్టులు.. దరఖాస్తు చేసుకున్నారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook