పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ హైకు చేరుకున్నాయి. భారీగా పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు ఆందోళన కల్గిస్తున్నాయి.
రోజురోజుకూ పెరుగుతూ పోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ( Petrol, Diesel prices ) సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. చుక్కల్ని తాకుతున్న ఇంధన ధరలు వినియోగదారులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఇది చాలదన్నట్టు చమురు కంపెనీ ( Oil Companies ) లు పెట్రో, డీజిల్ ధరల్ని మరోసారి పెంచాయి. జనవరి 19న లీటర్ పెట్రోల్ , డీజిల్ పై మరో 25 పైసలు పెరిగింది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో లీటల్ పెట్రోల్ 85 రూపాయలకు చేరుకుంది.
కేవలం వారం రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధర రూపాయికి పైగా పెరగడం గమనార్హం. జనవరి 6 వ తేదీ నుంచి ఇప్పటి వరకూ ఢిల్లీలో పెట్రోల్ ( Delhi Petrol Price ) ధర 1.49 పైసలు పెరగగా..డీజిల్ ధర 1.51 పైసలు పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఇంధన ధరలు ( Oil Prices ) ఆల్ టైమ్ హైకు చేరుకున్నాయి. ముంబై ( Mumbai petrol price ) లో ప్రస్తుతం లీటరు పెట్రోల్ 91 రూపాయల 80 పైసలు కాగా..డీజిల్ రేటు 82 రూపాయల 13 పైసలుగా ఉంది.
ఇక ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 85 రూపాయల 20 పైసలు కాగా..డీజిల్ ధర 75 రూపాయల 38 పైసలుంది. చెన్నై ( Chennai petrol price ) లో లీటర్ పెట్రోల్ ధర 87 రూపాయల 85 పైసలైతే..డీజిల్ ధర 80 రూపాయల 67 పైసలుంది. అటు కోల్ కత్తాలో లీటర్ పెట్రోల్ ధర 86 రూపాయల 63 పైసలు కాగా..డీజిల్ ధర 78 రూపాయల 97 పైసలుంది. హైదరాబాద్ ( Hyderabad petrol price ) లో అయితే లీటర్ పెట్రోల్ 88 రూపాయల 63 పైసలు కాగా..డీజిల్ ధర 82 రూపాయల 26 పైసలుంది. అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల 43 పైసలు కాగా..డీజిల్ ధర 84 రూపాయల 58 పైసలుంది.
Also read: AP: ఆ పిటీషన్ ఆమోదయోగ్యంగా లేదు: హైకోర్టులో వాదన విన్పించిన ఏజీ శ్రీరామ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook