Rathasapthami 2021: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో రథసప్తమి తేదీ ఖరారైంది. రథసప్తమి పర్వదిన ఏర్పాట్లపై టీటీడీ అధికారులు సమావేశం నిర్వహించారు. ఎవరెవరిని అనుమతించాలనే విషయంపై చర్చించారు.
హిందూవుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల ( Tirumala ) మరో ఉత్సవానికి సిద్ధమౌతోంది. సూర్య జయంతి ( Surya jayanti ) సందర్బంగా తిరుమల శ్రీవారి ఆలయం ( Tirumala Srivari Alayam ) లో ప్రతిష్ఠాత్మకమైన రథసప్తమి ( Rathasapthami ) నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. ఇవాళ తిరుపతిలోని టీటీడీ ( TTD ) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు. చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అడిషనల్ ఈవో ఏవి ధర్మారెడ్డి ఇతర అధికారులు సమావేశం నిర్వహించారు. రథసప్తమి పర్వదినాన అనుమతులపై సమీక్షించారు.
Also read: Bhogi: భాగ్యలక్ష్మి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పవిత్రదినాన్ని ఫిబ్రవరి 19న ( TTD Rathsapthami on February 19 )జరిపేందుకు టీటీడీ నిర్ణయించింది. దర్శనం టోకెన్లు ( Tirumala Darsham tokens ) ( How to get Tirumala Darshan tickets ) ఉన్న భక్తుల్ని మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని ఈ సందర్బంగా టీటీడీ ( TTD ) నిర్ణయం తీసుకుంది. ( How to attend Tirumala Rathasapthami ) రథసప్తమి పర్విదినాన శ్రీ మలయప్పస్వామిని ఏడు ప్రధాన వాహనాలపై ఆలయ మాడవీధుల్లో భక్తుల దర్శనార్ధం తీసుకెళ్తామని ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 19న సూర్యప్రభ వాహనంతో ప్రారంభించి..రాత్రికి చంద్రప్రభ వాహనంతో వాహనసేవలు ముగిస్తామన్నారు. చక్రస్నానం ఏకాంతంగా జరుగుతుందని..ఆ తరువాతే భక్తుల్ని గ్యాలరీలోకి అనుమతిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా భద్రతా పరంగా తీసుకోవల్సిన చర్యలపై అధికారులతో ఈవో చర్చించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలని..అన్ని శాఖల అధిపతులు పర్వదినానికి సిద్ధం కావాలని స్పష్టం చేశారు. రథసప్తమి ఏర్పాట్లను తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా సమీక్షించారు.
Also read: Bhogi mantalu..Kodi pandelu: తెలుగు లోగిళ్లలో వెలిగిన భోగి మంటలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook