Farmer protests Updates: న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల (Farm laws) ను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 50రోజులకు పైగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో రైతులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఢిల్లీలోని పలు బోర్డర్లల్లో నినసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య తొమ్మిదో దఫా చర్చలు జరగనున్నాయి. అంతకుముందు ఎనిమిది సార్లు జరగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే.
అయితే 12న సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కొత్త వ్యవసాయ చట్టాలపై స్టే విధిస్తూ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం తొమ్మిదోసారి జరగనున్న చర్చలపై ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా కేంద్ర చట్టాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తొలి సమావేశం కూడా ఈ నెల 19న జరుగనుంది. ఈ నేపథ్యంలో గురువారం రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రతీసారి లాగానే కేంద్రంతో చర్చలు జరిగే అవకాశముందని తెలిపారు. చర్చల్లో ఎలాంటి ఫలితం రాకపోవచ్చని స్పష్టంచేశారు. Also Read: Farm Laws: కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే
ఇదిలాఉంటే.. జనవరి 26న ఢిల్లీలో పెద్ద ఎత్తున కిసాన్ రిపబ్లిక్ పరేడ్ నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు ఇప్పటికే (Farmers Organizations) స్పష్టంచేశాయి. అయితే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా.. ఈ చట్టాల్లో సవరణలు మాత్రం చేస్తామని రద్దు చేసేదిలేదంటూ కేంద్రం (Central Government) పేర్కొంటోంది. Also Read: Republic day: విదేశీ అతిధి లేకుండానే గణతంత్ర దినోత్సవ వేడుకలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook