Hemoglobin: మానవ శరీరంలో ఐరన్ చాలా అవసరం. దీన్నే హిమోగ్లోబిన్ అంటారు. రక్తంలో కావల్సిన మోతాదులో లేకపోతే అనారోగ్యం వెంటాడుతుంది. మరేం చేయాలి..ఐరన్ డెఫిషియెన్సీని ఎలా పరిష్కరించుకోవచ్చు..
రక్తంలో హిమోగ్లోబిన్ ( Hemoglobin ) స్థాయి తక్కువగా ఉండటమంటే ఐరన్ డెఫిషియెన్సీ ( Iron Deficiency ) ఉన్నట్టే. ఐరన్ లోపముంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణమౌతుంది. క్రమంగా రక్తహీనతకు దారితీస్తుంది. ఫలితంగా ఎర్ర రక్తకణాల సంఖ్య తక్కువవుతుంది. యూనిసెఫ్ నివేదిక ప్రకారమైతే ఎక్కువగా బాలబాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. మరి ఈ ఐరన్ డెఫిషియెన్సీను మెరుగు పర్చుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
నల్లనువ్వుల్లో ( Black Sesame ) ఇనుము ( Iron ), రాగి ( Copper ) , జింక్, సెలీనియం, విటమిన్- బి6 ( Vitamin B6 ), విటమిన్ ఇ ( Vitamin E ) పుష్కలంగా లభిస్తాయి. ఒక టేబుల్ స్పూన్ నల్లనువ్వులు రోస్ట్ చేసి..ఒక్కొక్క టీ స్పూన్ తేనె, నెయ్యి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి తినాలి. ఐరన్ డెఫిషియన్సీ సమస్య త్వరగా తీరిపోతుంది.
Also read: Speed weight loss foods: వేగంగా అధిక బరువు తగ్గించే ఫుడ్స్
ఖర్జూరం, ఎండు ద్రాక్షలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. 2-3 ఖర్జూరాలు, ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను కలిపి ఉదయం పూట తీసుకోవాలి. ఫలితంగా తక్షణ శక్తి లభించడమే కాకుండా ఐరన్ కొరత తీరుతుంది.
బీట్రూట్ ( Beet root ), క్యారెట్లు కలిపి జ్యూస్ తాగడం ద్వారా ఐరన్ డెఫిషియెన్సీ పోతుంది. రెండూ కలిపి మిక్సీలో వేసి..కాస్త నిమ్మరసం కలిపి తాగాలి. ప్రతిరోజూ ఉదయం క్రమం తప్పకుండా తీసుకోవాలి.
ఇక వీట్‌గ్రాస్ మరో ముఖ్యమైనది. బీటా కెరోటిన్, విటమిన్ కే ( Vitamin k ), ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్ సిలను అందించే అద్బుత సాధనం వీట్‌గ్రాస్. ప్రతిరోజూ ఒక టీ స్పూన్ వీట్‌గ్రాస్ ( Wheat grass ) తీసుకుంటే హిమోగ్లోబిన్ బాగా పెరగడమే కాకుండా రోగ నిరోధక శక్తి ( Immunity power ) కూడా ఎక్కువవుతుంది.
Also read: Ginger health benefits: అల్లం రోజూ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook