గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి సందేశమిదే..!

భారతదేశ 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ జాతికి సందేశమిచ్చారు. అందులోని ముఖ్యంశాలు మీకోసం ప్రత్యేకం.

Last Updated : Jan 27, 2018, 12:25 AM IST
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి సందేశమిదే..!

భారతదేశ 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ జాతికి సందేశమిచ్చారు. అందులోని ముఖ్యంశాలు మీకోసం ప్రత్యేకం.

*రక్తాన్ని చిందించి, స్వేదాన్ని ధారపోసి భారతావనికి స్వాతంత్ర్యం తెచ్చినవారందరినీ గుర్తు చేసుకోవలసిన రోజు గణతంత్ర దినోత్సవం. జవానులు, డాక్టర్లు, రైతన్నలు, నర్సులు, సైంటిస్టులు, ఇంజినీర్లు... ఇలా అందరూ దేశానికి తమదైన శైలిలో సేవలందిస్తున్నారు. దేశమంటే మనుష్యులు.. వారే భారతావనికి ఉన్నతమైన భాగస్వాములు

*మన స్వాతంత్ర్య సమరయోధులు కేవలం దేశానికి స్వతంత్రం మాత్రమే తీసుకురావాలని కోరుకోలేదు. వారు జనాల్లో సామాజిక మార్పు కూడా రావాలని కోరుకున్నారు. మన దేశజనాభాలో 60% మంది ప్రజలు యువతరమే ఉన్నారు. వారే మన దేశానికి భవిష్యత్తు

*మన దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో ఒకటి బాలలు పోషకాహారలోపంతో బాధపడడం. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కృషి చేయాలి

*దాతృత్వం మన పురాతన సంస్కృతి. దానిని దేశంలోని ధనికులు అందరూ పునరుజ్జీవింపజేయాలి. పేదరిక నిర్మూలనలో ధనికులు కూడా పాలుపంచుకోవాలి. 

*డిజిటల్ ఎకానమి, జినోమిక్స్, రోబోటిక్స్ వంటి సాంకేతిక పద్ధతులకు విద్యావిధానంలో చోటు కల్పించాలి. మూసధోరణి గల విద్యాపద్ధతులకు స్వస్తి పలకాలి. 21వ శతాబ్దానికి అనుగుణంగా విద్యావ్యవస్థ రూపుదిద్దుకోవాలి. 

*కన్నతల్లి బిడ్డల్ని ఏ విధంగా కాపాడుతుందో..అదే విధంగా ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలవాలి

*మన దేశం వ్యూహాత్మక తయారీ రంగాన్ని ఆధునీకరించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. పరిశుద్ధమైన, పర్యావరణ అనుకూలమైన, పునర్వినియోగ ఇంధనం మన ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆశిద్దాం

 

Trending News