/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865 2024 Karthika Pournami Wishes: మీ  కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 180865

Special buses: సంక్రాంతి మరి కొద్దిరోజులు మాత్రమే మిగిలింది. తెలుగులోగిళ్లలో అతిపెద్ద పండుగ ఇదే. సంక్రాంతికి సీట్లు ఫుల్లవుతాయి. టిక్కెట్లు నిల్లవుతాయి. అందుకే దాదాపు 5 వేల బస్సులతో సిద్ధమౌతోంది టీఎస్ఆర్టీసీ..

తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ‌కు అతిపెద్ద పండుగ సంక్రాంతి. హైదరాబాద్ ( Hyderabad ) ‌లో ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం స్థిరపడిన వారంతా సంక్రాంతి ( Sankranthi ) తప్పకుండా సొంత ఊర్లకు పయనమవుతుంటారు. అందుకే సంక్రాంతికి ముందూ...తరువాత సీట్లు దొరకడం అసంభవమే. ప్రయాణీకుల సౌకర్యార్ధం టీఎస్ఆర్టీసీ  ముందుగానే సన్నాహాలు చేసింది. ఏపీ, ఇతర ప్రాంతాలకు నడిపేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏకంగా 4 వేల 980 బస్సుల్ని సిద్ధం చేసింది. ఇందులో తెలంగాణ ప్రాంతాలకు 3 వేల 380 బస్సుల్ని, ఏపీకు 16 వందల బస్సుల్ని నడపనుంది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని..జనవరి 8 నుంచి జనవరి 14 వరకూ ప్రత్యేక బస్సుల్ని నడపనున్నట్టు టీఎస్ఆర్టీసీ ( TSRTC ) ప్రకటించింది. అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం కూడా ఉంది. www.tsrtconline.in క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక బస్సుల్ని కేవలం ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్ నుంచే కాకుండా..కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్ నగర్, అమీర్ పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్,, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్నించిసైతం ప్రత్యేక బస్సుల్ని నడపనుంది టీపీఎస్ఆర్టీసీ.

Also read: Liquor sales in Telangana: కొత్త సంవత్సరం నాడు ఎంత మద్యం తాగారో తెలుసా ?

Section: 
English Title: 
Tsrtc to run nearly five thousand special buses on sankranthi
News Source: 
Home Title: 

Special buses: సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు సిద్ధం

Special buses: సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు సిద్ధం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Special buses: సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు సిద్ధం
Publish Later: 
No
Publish At: 
Saturday, January 2, 2021 - 21:42
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
58