Gold Price Today 31st December 2020: నిలకడగా బంగారం ధరలు.. మరోసారి వెండి పరుగులు!

Gold Rate Update 31st December 2020: బులియన్ మార్కెట్‌లో డిసెంబర్ నెలలో బంగారం ధరలు అనూహ్యంగా మారుతున్నాయి. అయితే అంతలోనే పెరిగి, మరుసటి రోజు ధరలు క్షీణిస్తున్నాయి. తాజా మరోసారి బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Dec 31, 2020, 01:13 PM IST
  • బులియన్ మార్కెట్‌లో మరోసారి నిలకడగా బంగారం ధరలు
  • తాజాగా రూ.51 వేల మార్క్ దిగువకు 10 గ్రాముల బంగారం ధర
  • తెలుగు రాష్ట్రాల్లో రూ.72,300కు చేరిన 1 కేజీ వెండి ధరలు
Gold Price Today 31st December 2020: నిలకడగా బంగారం ధరలు.. మరోసారి వెండి పరుగులు!

Gold Price Today 31st December 2020: బులియన్ మార్కెట్‌లో డిసెంబర్ నెలలో బంగారం ధరలు అనూహ్యంగా మారుతున్నాయి. అయితే అంతలోనే పెరిగి, మరుసటి రోజు ధరలు క్షీణిస్తున్నాయి. తాజా మరోసారి బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు మిశ్రమంగా ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నిలకడగా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి స్థిరంగా ఉన్నాయి.

 

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం‌, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర స్థిరంగా ఉంది.  దీంతో 10 గ్రాముల పసిడి ధర నిన్నటిలాగే రూ.50,950 వద్ద ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏ మార్పు లేకపోవడంతో 10 గ్రాముల ధర రూ.46,700 వద్ద మార్కెట్ అవుతోంది.

Also Read: 5 Health Mistakes: 2021 నుంచి ఈ తప్పులు అసలు చేయవద్దు

 

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో బంగారం ధర(Gold Price Today) స్వల్పంగా పెరిగింది. ఢిల్లీలో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.70 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.53,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 మేర పెరిగింది. ఢిల్లీలో నేడు 10 గ్రాముల ధర రూ.48,860 అయింది.

Gallery: Anchor Anasuya Photos: పింక్ డ్రెస్సులో యాంకర్ అనసూయ గుబాళింపు

 

బంగారం ధరలతో పోటీపడి మరి వెండి ధరలు పెరుగుతున్నాయి. డిసెంబర్‌ తొలి అర్ధభాగంలో వెండి ధరలు భారీగా పెరిగాయి, గత వారం క్షీణించిన వెండి మరోసారి పుంజుకుంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర తాజాగా రూ.200 మేర పెరిగింది. నేటి మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.68,400 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.100 మేర స్వల్పంగా పెరిగింది. తాజాగా ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.72,300కి చేరింది.  

Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News