Tamil Nadu: బీజేపీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్, ఖుష్బూ స్నేహితుడు

Laxman Sivaramakrishnan Joins BJP: భారత మాజీ క్రికెటర్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి భారీగా నేతల వలసలలతో పాటు పార్టీలోకి చేరికలు పెరిగిపోతున్నాయి.

Last Updated : Dec 30, 2020, 01:21 PM IST
  • బీజేపీలో చేరిన భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్
  • తమిళనాడు రాజకీయాల్లోకి కొత్త చేరికలు, వలసలు
  • నిన్ననే రాజకీయ అరంగ్రేటంపై రజనీకాంత్ కీలక నిర్ణయం
Tamil Nadu: బీజేపీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్, ఖుష్బూ స్నేహితుడు

Laxman Sivaramakrishnan Joins BJP in Chennai: భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ భారతీయ జనతా పార్టీ(BJP) తీర్థం పుచ్చుకున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ ఎల్.మురుగన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి సమక్షంలో టీమిండియా మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ బుధవారం చెన్నైలో బీజేపీలో చేరారు.

తమిళనాడు బీజేపీ చీఫ్ మరుగున్, సీటీ రవి.. భారత మాజీ క్రికెటర్‌కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీనియర్ నటి ఖష్బూ సుందర్(Khushboo Sundar)‌కు ఇద్దరు సన్నిహితులు, స్నేహితులు బీజేపీలో నేడు చేరనున్నారని ఖుష్బూ సైతం ట్వీట్ చేశారు. వేంధార్ టీవీ మాజీ అధిపతి ప్రసన్న, అలగస్వామి, మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్‌లు నటి ఖుష్బూకు స్నేహితులు అని తెలిసిందే. 

Also Read: Rajinikanth: రాజకీయ అరంగ్రేటంపై తలైవా సంచలన నిర్ణయం

 

కాగా, లెగ్ స్పిన్నర్ అయిన లక్ష్మణ్ శివరామకృషణ్ టీమిండియాకు 16 వన్డేలు, 9 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించారు. టెస్టుల్లో 26 వికెట్లు, వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టారు. రిటైర్మెంట్ తర్వాత 2000 ఏడాది కామెంటెటర్‌గా కెరీర్ ప్రారంభించారు. పలు అంతర్జాతీయ మ్యాచ్‌లకు కామెంటెటర్‌గా సేవలు అందించారు. ఆయనను ఎల్ఎస్ అని లేక శివ అని పిలిచేవారు. తాజాగా  బీజేపీ(BJP)లో చేరికతో తమిళనాడు రాజకీయాల్లోకి అరంగ్రేటం చేశారు.

Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి

రాజకీయాలు, క్రీడలు, వినోదం, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News