Work From Home: కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఉద్యోగులు వద్దు మొర్రో అన్నా వారికి పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. కొన్ని కంపెనీలు సాధ్యమైనంత వరకు ఉద్యోగులను తొలగించి, ఖర్చుల భారం తగ్గించుకున్నాయి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా మీకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయంటే ఓసారి ఆలోచించాల్సిందే..
కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఉద్యోగులు వద్దు మొర్రో అన్నా వారికి పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. కొన్ని కంపెనీలు సాధ్యమైనంత వరకు ఉద్యోగులను తొలగించి, ఖర్చుల భారం తగ్గించుకున్నాయి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా మీకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయంటే ఓసారి ఆలోచించాల్సిందే.. Also Read: Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!
ఆఫీసు నుంచి కాల్ వస్తే చికాకు పుడుతుందా.. అర్థంపర్థం లేని, ప్రయోజనం చేకూర్చని ఆన్లైన్ టీమ్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారని మీరు ఇబ్బంది పడుతున్నారా.. అయితే మీరు చేస్తున్న జాబ్ గురించి ఓసారి ఆలోచించుకోండి. మీరు సరైన స్థానంలో లేరని భావిస్తే కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి.
మీకు అవసరం ఉన్నా, లేకున్నా ప్రతినెలా పదే పదే సెలవులు తీసుకుంటున్నారా.. ఆఫీసు పని నుంచి తప్పించునేందుకు ట్రై చేస్తున్నారంటే మీ పరిస్థితి అంతగా బాగాలేదని అర్థం చేసుకోండి. వీలైతే ఈ ఇబ్బంది నుండి బయట పడేందుకు యత్నించండి. లేకపోతే మరోచోట జాబ్ వెతుక్కోవడమే రెండోదారిగా కనిపిస్తుంది.
సహ ఉద్యోగులతో తరచుగా ఫోన్లో మాట్లాడి మీ పనిని తేలిక అయ్యేలా ప్లాన్ చేసుకోండి. అలాంటి వాటికి అవకాశమే లేదని భావిస్తే ఇక్కడ మీరు ఎక్కువకాలం కొనసాగలేరని గమనించాలి. వీటితో పాటు మీరు ఆత్మన్యూనతకు లోనైనట్లు తరచుగా ఫీల్ అవుతున్నారంటే కచ్చితంగా ఉద్యోగం మారాల్సిందే. మీకు ఇచ్చిన టార్గెట్స్ పూర్తి చేసేందుకు ఆఫీసు నుంచి తగిన సహకారం లేదని భావిస్తే సైతం ప్రస్తుత కంపెనీ నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోవడం వ్యక్తిగతంగానూ మంచిదని సైకాలజిస్టుల అభిప్రాయం.
సాధారణంగా ఉద్యోగం చేయడానికి కావాలసిన సంఖ్యకన్నా తక్కువ మంది పనిచేస్తున్నట్లయితే అది సమస్య అని చెప్పవచ్చు. దీనివల్ల మీరు అదనపు ఒత్తిడికి లోనవుతారు. తద్వారా మీకు ఇచ్చిన టాస్కులను పూర్తి చేయడానికి చాలా శ్రమించాల్సి వస్తుంది. నిజంగానే మీ మీద పని భారం శక్తికి మించిగానీ, లేక మరీ ఎక్కువగా ఉన్నట్లుగా భావిస్తే అలాంటి ఉద్యోగానికి గుడ్ బై చెప్పడం మంచిది. లేనిపక్షంలో దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మానసిక నిపుణులు సైతం సూచిస్తున్నారు. Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి