Telangana Coronavirus Updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో నిన్న కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో ( డిసెంబరు 25న ) శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 317 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఇద్దరు (2) ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,84,317 కి చేరగా.. మరణాల సంఖ్య 1,529 కి పెరిగింది. Also read: Bhutan: పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్లీ లాక్డౌన్
ఇదిలాఉంటే.. రాష్ట్రంలో కేసులతోపాటు (Covid-19) కరోనా కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 536 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,76,244 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 6,618 యాక్టివ్ కేసులు ఉన్నాయి. Also Read: Kazakhstan: సెక్స్ బొమ్మను వివాహమాడిన బాడీబిల్డర్
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.13 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతం ఉంది. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా నిన్న 30,376 కరోనా టెస్టులు చేశారు. వీటితో కలిపి డిసెంబరు 25వ తేదీ వరకు మొత్తం 66,86,363 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. హైదరాబాద్ (GHMC) పరిధిలో 71 కేసులు నమోదయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook