Good News for Farmers - PM Narendra Modi | న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు మరో విడత నగదు బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నగదు బదిలీని ఈనెల 25న శుక్రవారం ఒక్కో రైతు ఖాతాలో రూ.2000 చొప్పున జమ చేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తెలిపింది. దీనికి (PM Kisan Samman Nidhi) సంబంధించిన నిధులను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేయనున్నారు. దీంతోపాటు ఆయన దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ (narendra singh tomar) కూడా పాల్గొననున్నారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా.. దేశంలో మొత్తం 9 కోట్ల మందికి పైగా ఉన్న రైతులకు మరో విడత ఆర్థిక చేయూతను అందించడం కోసం రూ.18,000 కోట్లకుపైగా నిధులను ప్రధాని మోదీ (PM Narendra Modi ) విడుదల చేయనున్నారని పీఎంవో వెల్లడించింది. ఈ సందర్భంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం, రైతు సంక్షేమం కోసం కేంద్రం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై రైతులతో ప్రధాని సంభాషిస్తారని వెల్లడించింది. Also read: Narendra Modi: ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ప్రతిఫలాలు
PM Modi will also have a conversation with farmers from 6 different states during the event. The farmers will share their experiences with PM-KISAN & also on various other initiatives taken by govt for farmers' welfare. Agriculture Minister will also be present: PMO https://t.co/zySkySBiH9
— ANI (@ANI) December 23, 2020
దేశంలోని రైతులందరికీ ఆర్థిక సాయం అందించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి ఏడాది ఒక్కో రైతు ఖాతాలో రూ.6,000 చొప్పున జమ చేస్తున్నారు. అయితే ఈ ఆర్థిక సాయాన్ని ఏడాదిలో మూడు విడుతల్లో రూ.2,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook