KGF Chapter 2: కేజీఎఫ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. రేపే సర్‌ప్రైజ్

కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా అప్డేట్స్ కోసం.. యావత్తు సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే.. దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో కన్నడ యాంగ్రి యంగ్ మేన్ యష్ హీరోగా.. తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి గత రికార్డులను తిరగరాసింది.

Last Updated : Dec 20, 2020, 09:28 AM IST
KGF Chapter 2: కేజీఎఫ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. రేపే సర్‌ప్రైజ్

#GoodNews - KGF 2 teaser release date updates: కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా అప్డేట్స్ కోసం.. యావత్తు సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే.. దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో కన్నడ యాంగ్రి యంగ్ మేన్ యష్ హీరోగా.. తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి గత రికార్డులను తిరగరాసింది. అందుకే సినీ అభిమానులంతా కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF Chapter 2) అప్డేట్స్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆ క్షణం రానే వచ్చింది. డిసెంబరు 21న అంటే.. రేపు అభిమానులకు స్పేషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు మూవీ మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ డిసెంబ‌ర్ 21న రానుంద‌ని.. అది ప్రేక్షకులందరికీ స్పెషల్ కానుందని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఉద‌యం 10.08ని.ల‌కు ఈ అప్‌డేట్ రానున్న‌ట్టు పేర్కొన్నారు. 

ప్రస్తుతం యశ్ (Yash) సంజయ్ దత్ (Sanjay Dutt ) మీద క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వీరితోపాటు ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు రవీనా టాండన్ (Raveena Tandon) , శ్రీనిధి శెట్టి ( Srinidhi Shetty ) తదితరులు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా షూటింగ్ ఆఖరి దశకు చేరుకోవడంతో అభిమానులు ఈ సినిమా టీజర్ ( KGF 2 teaser ) విడుదల చేస్తారా లేక మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Also read: Priya Prakash Varrier: అందాలతో కనువిందు చేస్తున్న ప్రియా ప్రకాష్

అయితే 2018 డిసెంబర్ 21న కేజీఎఫ్ సినిమా విడుదలైంది. 2019 డిసెంబర్ 21న కేజీఎఫ్ చాప్టర్ 2 లో యశ్ ఫస్ట్‌ లుక్ పోస్టర్ బయటకు వచ్చింది. ఈ సెంటిమెంట్ ప్రకారం ఈ ఏడాది కూడా స్పెషల్ ట్రీట్ రాబోతుంది. అయితే ఆ ట్రీట్ ఏమై ఉంటుందో చూడాలంటే.. మరో కొన్ని గంటలపాటు వెయిట్ చేయాల్సిందే. Also read: Sai Dharam Tej: ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ట్రైలర్ రిలీజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x