Renu Desai did not attend Niharikas Wedding: మెగా ఫ్యామిలీ కొణిదెల వారింట ఇటీవల జరిగిన పెళ్లిసందడి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్ నటి నిహారిక, వెంకట చైతన్యల వివాహానికి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా మారింది. డిసెంబర్ 9న రాత్రి నిహారిక, చైతన్యలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Photos: Kajal Aggarwal at Acharya sets: హనీమూన్ నుంచి ఆచార్య సెట్‌కు కాజల్, గౌతమ్ కిచ్లు
మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకేచోట కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాతి తరం మెగా హీరోలైన రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్ తదితర యువ హీరోలు నిహారిక పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేశారు. అయితే మెగా ఫ్యాన్స్‌కు ఒక మిలియన్ డాలర్ ప్రశ్న మిగిలింది. ఈ వేడుకలో రేణు దేశాయ్ ఎందుకు కనిపించలేదు, నిహారిక వివాహానికి ఆమె ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నలు, అనుమానాలు మొదలయ్యాయి.
Gallery: Niharika Konidela Wedding Photos: నటి నిహారిక వివాహ వేడుక ఫొటో గ్యాలరీ
కొందరైతే ఆమెను వేడుకను ఆహ్వానించలేదని సైతం ప్రచారం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో నిహారిక వివాహానికి రేణు దేశాయ్ ఎందుకు హాజరుకాలేదనే విషయంపై నటి క్లారిటీ ఇచ్చారు. తనకు ముందుగా ప్లాన్ చేసుకున్న షూటింగ్ షెడ్యూల్లో పాల్గొనాల్సి రావడంతో నిహారిక పెళ్లికి హాజరుకాలేకపోయానని చెప్పారు. అయితే తన ఇద్దరు పిల్లరు అకిరా నందన్, ఆధ్యలు తండ్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి పెళ్లి వేడుకలో పాల్గొని సరదాగా గడిపారని పేర్కొన్నారు.
Gallery: Niharika Wedding Celebration Photos: నిహారిక పెళ్లి వేడుకల్లో బాబాయ్ పవన్ కళ్యాణ్ సందడి షురూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe