GHMC Election - Neredmet Results: హైదరాబాద్: ఎంతో రసవత్తరంగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ( GHMC ) ఎన్నికల ఫలితాలు 4న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే 150 డివిజన్లకు గాను 149 డివిజన్ల ఫలితాలే విడుదలకాగా.. నేరెడ్‌మెట్ (Neredmet) డివిజన్ ఫలితం కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. అయితే నేరెడ్‌మెట్ డివిజన్ ఓట్లను లెక్కించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. బుధవారం ఉదయం 8 గంటలకు ఆ డివిజన్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. సైనిక్‌పురిలోని వివేకానంద కాలేజీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఓటింగ్ సమయంలో ఓటర్లకు స్వస్తిక్ ముద్రకు బదులు, పొరపాటున పోలింగ్ కేంద్రం సంఖ్య తెలిపే ముద్రల్ని ఇచ్చామని తెలంగాణ ( Telangana ) రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిబ్బంది తెలిపారు. దీంతోపాటు స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లను లెక్కించాలని ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్‌పై బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వినించిన వాదనలను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. Also read; GHMC Election Results: ఎవరికీ దక్కని మెజారిటీ.. బలమైన పార్టీగా బీజేపీ
స్వస్తిక్ మార్క్ కాకుండా ఇతర మార్కులను ఉపయోగించి బ్యాలెట్ పేపర్‌పై ఓటు వేసినప్పుడు ఎన్నికల నియమాలు, 2005 రూల్ 51 ప్రకారం రిటర్నింగ్ అధికారికి తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉందని ఎస్‌ఈసీ తెలిపింది. దీన్ని సమర్థించిన కోర్టు వివాదాస్పద ఓట్లను లెక్కించాలని ఆదేశించింది. Also read: GHMC: వరద సాయం కోసం మీ సేవా సెంటర్లకు వెళ్లొద్దు: కమిషనర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
GHMC Elections: నేరెడ్‌మెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం