Paints Govt school veranda as train compartments | సాధారణంగా విద్యార్థులు తమ స్కూళ్లకు రావాలని అధికంగా ప్రైవేట్ యాజమాన్యాలు భావిస్తుంటాయి. అందుకు తగ్గట్లుగా జిమ్మిక్కులు సైతం ప్రదర్శిస్తుంటాయి. అవసరమైతే విద్యార్థుల ఇళ్లు వెళ్లి స్కూల్‌కు ఎందుకు రావడం లేదని ఆరాతీసి మరి తమ స్కూళ్లలో చేర్చుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే ప్రభుత్వ పాఠశాలల విషయానికొస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. తమకు ఎలాగూ ఆలస్యం అవకుండా జీతం చేతికి వస్తుందని ఆ స్కూల్ టీచర్లు భావించవచ్చు. కానీ ఓ స్కూల్ టీచర్లు, మేనేజ్ చేసిన ప్రయత్నం నెటిజన్ల మనసుల్న కదిలిస్తోంది.
తమిళనాడులోని పుదుకొట్టాయ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలను రైలులాగ మార్చేశారు. అదేనండీ.. స్కూలు వరండా మొత్తాన్ని రైలు కంపార్ట్మెంట్స్లాగ పెయింటింగ్ వేసి అందంగా తీర్చిదిద్దారు. దీనిపై జాతీయ మీడియా ఏఎన్ఐ ఆ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విషయం ఏంటని ఆరా తీయగా అసలు విషయం తెలిసిందే. అయితే స్కూల్‌ను రైలు లాగా చేయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read : Bigg Boss Telugu 4 Voting numbers: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఓటింగ్ నెంబర్స్
Tamil Nadu: Govt school in Pudukottai district, paints school veranda as train compartments
"Students here come from backward families & don't travel on trains. We drew this so that after coming back to school, students can experience & learn of parts of a train," says a teacher pic.twitter.com/PHnEQ9gbsW
— ANI (@ANI) December 8, 2020
‘ఈ పాఠశాలు చాలా మారుమూల ప్రాంతాలు, వెనుకబడిన తరగతుల సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకునేందుకు వస్తుంటారు. వారు ఎప్పుడు రైళ్లో ప్రయాణించి ఉండరు. వారికి రైలు ఎక్కిన అనుభూతి కలగాలని.. రైలులో ఎలాంటి కంపార్ట్మెంట్స్ ఉండాలో తెలిసేందుకు ఇలా చేశామని’ ఓ మహళా టీచర్ వివరించారు. విద్యార్థులను మంచి అనుభూతి కలిగేంచుకు టీచర్లు చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకుని తీరాల్సిందే.
Also Read : Niharika Wedding: రాజస్థాన్‌లో నిహారిక పెళ్లి సందడి షురూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe