శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ 'దడక్' అనే చిత్రం ద్వారా తెరంగేట్రం చేస్తోంది. ఆ సినిమాలో ఆమె షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ సరసన నటిస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ యంగ్ హీరో జాహ్నవికి సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పెడితే అప్పుడు కానుకల వర్షం కురిపిస్తు్న్నాడట. అంతే కాదు.. ఆమెను షాపింగ్లకూ, షికార్లకు కూడా దగ్గరుండి తీసుకెళ్తున్నాడట. అయితే వారు ప్రేమించుకుంటున్నారని మాత్రం భ్రమలో పడవద్దని.. అది కేవలం 'దడక్' మూవీ ప్రమోషన్లో భాగమేనని అంటున్నారు కొందరు నెటిజన్లు. ఏదేమైనా ఈ యువజంట చేస్తున్న షికార్లన్నీ కూడా ఫోటోల రూపంలో మాత్రం సోషల్ మీడియాలో మాత్రం బాగానే హల్చల్ చేస్తున్నాయి. కరణ్ జోహార్ నిర్మిస్తున్న 'దడక్' జులై 6, 2018 తేదీన విడుదల కానుంది.
శ్రీదేవి కూతురుకి గిఫ్ట్ ఇచ్చిన యంగ్ హీరో..!