సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ప్రస్తుత పాలిటిక్స్ ట్రెండ్‌పై ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాజకీయాలన్నీ కులాల చుట్టూ తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని ట్వీట్ చేసిన పవర్ స్టార్.. కుల రాజకీయాలు ఆర్థిక ఎదుగుదలను దెబ్బ తీయడమే కాకుండా సమాజం అభివృద్ధికి కూడా ఓ అవరోధంగా నిలుస్తాయని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు..నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు.(Dont know who said it but a respectable & senior journalist has greeted me today morning with the above quote.Felt like sharing.Good day!
— Pawan Kalyan (@PawanKalyan) January 6, 2018
''వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు..నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు". ఈ మాటలు అన్నది ఎవరో నాకు సరిగ్గా తెలియదు కానీ ఈరోజు ఉదయం శుభాకాంక్షలు చెబుతూ ఓ సీనియర్ జర్నలిస్ట్ నాకు పంపించిన సూక్తి ఇది. ఇది నలుగురితో పంచుకోవాలని అనిపించింది. అందుకే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను' అని ట్వీట్ చేసే క్రమంలో పవర్ స్టార్ కుల రాజకీయాలపై పై విధంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
The rise of caste division, caste polarisation & the power politics played around is truly alarming.It will not only hit the economic progress but also it will do irreversible damage to our society and to the collective psyche of our society.
— Pawan Kalyan (@PawanKalyan) January 6, 2018