సిద్ధిపేట ఎందులో నెంబర్ వన్..?

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఈ క్రమంలో ఈ జిల్లా సరికొత్త రికార్డుతో దేశంలోనే నెంబర్ వన్‌గా అవతరించబోతుందని ఆ జిల్లా అధికారులు అంటున్నారు.

Last Updated : Jan 5, 2018, 07:34 PM IST
సిద్ధిపేట ఎందులో నెంబర్ వన్..?

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఈ క్రమంలో ఈ జిల్లా సరికొత్త రికార్డుతో దేశంలోనే నెంబర్ వన్‌గా అవతరించబోతుందని ఆ జిల్లా అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఈ జిల్లాల్లోని 243 గ్రామాలు, మూడు మున్సిపాలిటీల్లో 70 నిర్మాణ సంస్థలు డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తిచేసిన క్రమంలో ఈ జిల్లాను జాతీయ స్థాయి పురస్కారానికి ప్రతిపాదిస్తున్నట్లు తెలంగాణ సర్కారు తెలిపింది.

దేశంలోనే మరే రాష్ట్రంలో లేని విధంగా ఇన్ని డబుల్ బెడ్రూం ఇళ్ళు కట్టడంలో సిద్ధిపేట ప్రథమ స్థానంలో ఉందని రికార్డులు చెబుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. సిద్దిపేటలోని నర్సపురం, గజ్వేల్ మండలంలోని సంగాపూర్, దుబ్బాక నగర పంచాయితీలో నిర్మాణమవుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ళు ఆ ప్రాంతాలను మోడల్ కాలనీలుగా మారుస్తూ దేశంలోనే అన్ని గ్రామాలకు ఆదర్శప్రాయం అయ్యాయని ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. 

 

Trending News