Two West Delhi's markets sealed: న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబరు 28 నుంచి నిత్యం ఐదువేల నుంచి 8వేల వరకు కరోనా (Coronavirus) కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలను చేపట్టింది. బయటకు వచ్చేటప్పుడు మాస్కును విధిగా ధరించాలని.. ముఖ్యంగా మార్కెట్లల్లో కోవిడ్ నిబంధనలను పాటించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం సూచించారు. ఈ మేరకు మాస్కు ధరించని వారి జరిమానాను ఏకంగా 500నుంచి 2వేలకు పెంచారు. కరోనా నిబంధనలు పాటించేలా మార్కెట్‌ల ప్రతినిధులతోనూ సీఎం సమావేశమయ్యారు. ఈ క్రమంలో కరోనా గైడ్‌లైన్స్ (COVID-19 rules) పాటించని నాంగ్లోయిలోని రెండు మార్కెట్లను వారం రోజుల పాటు నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ చేశారు.
ఈ మేరకు నాంగ్లోయిలోని పంజాబీ బస్తీ మార్కెట్ (Punjabi Basti Market), జనతా మార్కెట్ (Janta Market) ను ఆదివారం రాత్రి పశ్చిమ ఢిల్లీ (West Delhi ) జిల్లా అధికారులు సీల్ చేశారు. మార్కెట్‌లల్లో ఏమాత్రం కోవిడ్ నిబంధనలను పాటించడం లేదని.. ఈ మేరకు నవంబర్ 30 వరకు రెండు మార్కెట్లను సీల్ చేసినట్లు విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, మాస్కులు లేకుండా విక్రయాలను చేపడుతున్నారని పేర్కొన్నారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటించని మార్కెట్లను మూసివేస్తామని కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. Also read: Indian Army: సరిహద్దుల్లో రహస్య సొరంగం గుర్తింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి
Delhi: కోవిడ్ గైడ్‌లైన్స్ ఉల్లంఘన.. రెండు మార్కెట్లు సీజ్