ప్రముఖ కొరియో గ్రాఫర్, దర్శకుడైన ప్రభుదేవా మరోసారి పెళ్లి పీటలెక్కనున్నాడు. నయనతారతో బ్రేకప్ అనంతరం ఇప్పడు మరో అమ్మాయితో ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. త్వరలో పెళ్లి కూడా ఖాయమయ్యేట్టు కన్పిస్తోంది.
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో చిరపరిచితమైన కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా పేరు అందరికీ తెలిసిందే. ఎందరో డ్యాన్సర్లకు ప్రభుదేవా ఓ స్ఫూర్తి. ఇప్పుడు ప్రభుదేవా మళ్లీ ప్రేమలో పడినట్టు పరిశ్రమలో కోడై కూస్తున్నారు అంతా. బంధువుల అమ్మాయితో ప్రేమలో పడినట్టు సమాచారం.
వాస్తవానికి ప్రభుదేవా ( Prabhudeva ), నయనతార ( Nayanatara )ల మధ్య ప్రేమ వ్యవహారం చాలా కాలం నడిచింది. ఈ ప్రేమ పర్యవసానమే ప్రభుదేవా తన భార్యకు విడాకులిచ్చేశారు. భార్యకు విడాకులిచ్చిన తరువాత చాలాకాలం నయనతారతో ప్రేమలో మునిగితేలారు. కొద్దికాలానికి నయనతారతో బ్రేకప్ అయింది. బ్రేకప్ కారణంగా ప్రభుదేవా నిరాశకు గురయ్యారు. సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తరువాత తేరుకుని మళ్లీ సినీ పరిశ్రమకు చేరువయ్యారు.
ఇప్పుడు మళ్లీ బంధువుల అమ్మాయితో పూర్తిగా ప్రేమలో మునిగినట్టు తెలుస్తోంది. త్వరలో పెళ్లి కూాడా చేసుకోబోతున్నట్టు సమాచారం. బంధువులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రభుదేవా మొదటి భార్య రామలత కాగా ఇద్దరబ్బాయిలు కూాడా ఉన్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ( Salman khan ) హీరోగా రాధే సినిమా ( Radhe Movie ) తీస్తున్నారు ప్రభుదేవా. Also read: RRR టీమ్ దీపావళి సర్ప్రైజ్ చూశారా..