రిపబ్లికన్ టివి ఎడిటర్ ఇన్ ఛీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు వ్యవహారంలో బీజేపీ నేతలపై శివసేన మండిపడుతోంది. శివసేన ముఖపత్రిక సామ్నా తన సంపాదకీయం ద్వారా బీజేపీపై విమర్శలు చేసింది. అర్నాబ్ అరెస్టును 1975 ఎమర్జెన్సీతో పోల్చడం, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను నాటి ప్రధాని ఇందిరాగాంధీతో పోల్చడంపై విమర్శలు ఎక్కుపెట్టింది.
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడిలా నకిలీ వార్తలను ప్రచారం చేయడమనేది మాటిమాటికీ కోర్టులో కేసులు వేయడం బీజేపీకే చెల్లుబాటైందని సామ్నా సంపాదకీయం ఎద్దేవా చేసింది. ఓటమి అంచున ఉన్న ట్రంప్ తరహాలోనే బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని విమర్శించింది. ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు అర్నబ్‌ను అరెస్టు చేస్తే బీజేపీ ఆందోళనలు చేస్తోందని..ఆ వ్యక్తి కుటుంబంపై అభాండాలు వేస్తోందని మండిపడింది. పత్రికా స్వేచ్ఛ గురించి బీజేపీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని సామ్నా తెలిపింది. Also read: FASTag Mandatory: ఫాస్టాగ్ ఇక తప్పనిసరి, ఎప్పటి నుంచో తెలుసా ?
ఉద్ధవ్ ఫొటోతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫొటోలు పెట్టి, ప్రస్తుత పరిస్థితిని పోల్చి చూడటం బీజేపీ చేష్టలకు ఉదాహరణ అని సామ్నా పేర్కొంది. అయినా శివసేన ఈ విషయాన్ని గౌరవంగా స్వీకరిస్తోందని చెప్పింది.
మరోవైపు రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ ఛీఫ్ అర్నాబ్ గోస్వామి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి నిరాకరించింది. తాత్కాాలిక బెయిల్ నిరాకరించింది. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, అతని తల్లి ఆత్మహత్యకు సంబంధించి నవంబర్ 4 న మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లా పోలీసులు అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేశారు. నిందితుడు అర్నాబ్.. అన్వయ్‌కి బకాయిలు చెల్లించలేదని ఆరోపణలపై ఈ అరెస్టు జరిగింది. Also read: LK Advani Birthday: అగ్రనేతకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ