China Banks Pan Shop | మాట తూటా లాంటిది.. జాగ్రత్తగా మాట్లాడాలి అని పెద్దలు చెబుతుంటారు. కానీ కొన్ని సార్లు ఆవేశంలో, అనాలోచితంగా నోటి నుంచి జారే పదాలు తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం చైనాకు చెందిన దిగ్గజ సంస్థ అలీబాబా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక్క మాటతో తిరోగమనం బాట పట్టింది.
ఒక్క మాటతో లక్షల కోట్ల నష్టం...
జాక్ మా ( Jack Ma ) స్థాపించిన అలీబాబా సంస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న సంస్థల్లో ఒకటి. అత్యంత సంపదగల వ్యక్తుల్లో జాక్ మా తప్పకుండా ఉంటాడు. అయితే మాట విలువ ఏంటో అలీబాబా తెలుసుకోలేకపోయాడేమో. అందుకే అనకూడని మాట అని రెండున్న లక్షల కోట్లను పొగొట్టుకున్నాడు.
Also Read | Gold Smuggling: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారు స్మగ్లర్ అరెస్ట్
ఒక్కమాటతో... ఐపీఓ ఆగిపోయింది
జాక్ మా అన్న ఒక్క మాట ప్రపంచంలోని అత్యంత పెద్దదైన ఐపీఓ ( IPO ) ఎంట్రీని ఆపేసింది. చైనా బ్యాంకు అనేది పాన్ షాపు లాంటిది అని కామెంట్ చేశాడు జాక్. అయితే దీనిపై చైనా ( China ) బ్రోకరేజ్ సంస్థలు మాత్రం ఇందులో తప్పేంఉంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం జాక్ మాపై చర్యలు తీసుకోవడం ఏంటి అని అవి కామెంట్ చేస్తున్నాయి. ఐపీఓ ఆపకుండా ఉండాల్సింది అని అవి చెబుతున్నాయి. చైనా మార్కెట్ బ్యాంకు పాన్ డబ్బా ( China Banks Are like Pan Shops) లాంటిది అనే విధంగా కామెంట్ చేయడం ఇది తొలిసారి కాదు. ఇంతకు ముందు చైనాకు చెందిన బ్యూరోక్రాట్స్ కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు.
Also Read | Hrithik Roshan: హాలీవుడ్ చిత్రంలో నటించనున్న హృతిక్ రోషన్
చైనా బ్యాంకు పాన్ షాపు లాంటిది
చైనాలో అత్యంత ధనవంతుడైన వ్యక్తి జాక్ మా.. ఇటీవలే ఒక హైప్రోఫైల్ ఫైనాన్షియల్ మీటింగ్ లో చైనా బ్యాంకింగ్ సిస్టమ్ గురించి కామెంట్ చేశాడు. ప్రపంచ బ్యాంకులు పాత పీపుల్స్ క్లబ్ లాంటివి అని.. చైనా బ్యాంకు పాన్ షాపు లాంటిది ( అరువుపై ఉన్న షాపు లాంటిది) అని అందులో దాని నుంచి విముక్తి పొందడం చాలా కష్టం అని కామెంట్ చేశాడు. ఈ మాట అన్న మరుసటి రోజే బీజింగ్ టాస్ ఫైనాన్షియల్ రెగ్యులేటర్ జాక్ మాను పిలిచి క్లాస్ పీకాడట. వెంటనే ఐపీఓను సస్పెండ్ చేశాడట. దీంతో జాక్ మాకు కొన్ని లక్షల కోట్ల నష్టం వాటిల్లింది అని సమాచారం.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR