సుప్రీంకోర్టు ( Supreme court ) ముంగిటకు మరో కీలక నివేదిక చేరింది. ప్రజా ప్రతినిధుల వ్యాజ్యాలకు ( Public representatives cases ) సంబంధించిన అంశమిది. సుప్రీంకోర్టు రేపు దీనిపై విచారణ చేపట్టనుంది.
ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్న ప్రజా ప్రతినిధులపై వ్యాజ్యాల్ని త్వరగా పరిష్కరించాలన్న వాదన పెరుగుతోంది. దీనికి కారణం కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే. నేరచరిత ( Criminal record ) ఉన్నట్టు గానీ లేదా నేరం ఖరారైన ప్రజా ప్రతినిధులు చట్టసభకు అనర్హులనేది ఆ తీర్పు సారాంశం. అయితే కోర్టులో ఉన్న వేలాది కేసుల కారణంగా విచారణ ఆలస్యమయ్యేకొద్దీ..సదరు ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో సభ్యులుగానే కొనసాగే పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో తమపై ఉన్న కేసుల్ని కూడా త్వరగా ముగించుకోవాలనే ఆలోచన ఆ ప్రజా ప్రతినిధులకు ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల్ని త్వరగా విచారించాలనే అభ్యర్ధనలు వస్తున్నాయి.
ఇందులో భాగంగానే ఇప్పుడు మరో నివేదిక వచ్చింది సుప్రీంకోర్టు ముంగిటకు. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల్ని త్వరగా విచారించే విషయానికి సంబంధించి ఓ నివేదిక సుప్రీంకు చేరింది. ఈ నివేదికను అమికస్ క్యూరీ ( Amicus curiae ) హన్సారియా ( Vijay Hansaria ) కు సమర్పించారు. హైకోర్టులు ఇచ్చిన వివరాల సారాంశంతో అమికస్ క్యూరీ ఇచ్చిన నివేదికపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
వాస్తవానికి మద్రాస్ హైకోర్టు ( Madras High court ) కు చెందిన త్రిసభ్య క్రిమినల్ రూల్స్ కమిటీ వేసిన ప్రశ్న ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సత్వర విచారణ కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక కోర్టులకు రాజ్యాంగ బద్ధత ఉందా అనేది ఆ ప్రశ్న. ప్రత్యేక కోర్టులు నేరస్తుడి కేంద్రంగా కాకుండా నేరం కేంద్రంగా ( Offence centric ) ఉండాలని తేల్చిచెప్పింది. ఈ కోర్టుల్ని చట్టసభల్లో శాసనం ద్వారా ఏర్పాటు చేయడం లేదని తప్పుపట్టింది. న్యాయ, కార్యనిర్వాహక విభాగం నిర్ణయాలతో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం ఎలా సాధ్యమని వ్యాఖ్యానించింది. త్రిసభ్య కమిటీ తన 80 పేజీల నివేదికను సీనియర్ అడ్వొకేట్ విజయ్ హన్సారియాకు సమర్పించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రత్యేక కోర్టుల అంశంలో సుప్రీంకోర్టు ఆయనను అమికస్ క్యూరీగా నియమించింది. ఈ నివేదికను విజయ్ హన్సారియా సోమవారం సుప్రీంకోర్టుకు అందజేశారు. దీనిపై జస్టిస్ ఎన్.వి.రమణ ( justice n v ramana ) నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. రాజ్యాంగబద్ధత లేని ప్రత్యేక కోర్టులతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని త్రిసభ్య కమిటీ తేల్చిచెప్పింది. Also read: FIR on Amitabh Bachchan And KBC 12: అమితాబ్ బచ్చన్, కేబీసీ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్