ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) నుంచి రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) నిష్క్రమించింది. జట్టులో ఏడు, ఎనిమిది మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ అసలు పోరాటమే చేయకుండా చేతులెత్తేయడంతో లీగ్ దశలో జరిగిన చివరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) చేతిలో 60 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది.
Also Read : IPL 2020: చెన్నై బాటలోనే పంజాబ్.. టోర్నీ నుంచి ఔట్
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) మీడియాతో మాట్లాడాడు. ‘దుబాయ్‌లో 180 పరుగులు కచ్చితంగా చేయవచ్చు. మంచు ప్రభావం కనిపించింది. పవర్ ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోవడంతో ఆత్మరక్షణలో పడ్డాం. పవర్ ప్లే నుంచి సమస్యలు మొదలయ్యాయి. కేకేఆర్ బౌలర్ కమిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మంచి షాట్లు ఆడే బంతులు సంధించి కమిన్స్ వికెట్లు సాధించాడు.
Also Read : Rajasthan Royals: ఐపిఎల్ 2020 నుంచి రాజస్థాన్ రాయల్స్ ఔట్
సీజన్‌ను చాలా బాగా ఆరంభించాం. మధ్యలో తడబడ్డాం. చివరి రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి టచ్‌లో కనిపించాం. ఈ మ్యాచ్‌లో పరిస్థితి తలకిందులైంది. బ్యాట్స్‌మెన్ వైఫల్యం వల్లే టోర్నీ నుంచి నిష్క్రమించాం. టాప్ 5 బ్యాట్స్‌మెన్ బాధ్యతారాహిత్యంగా ఆడటంతో భారీ మూల్యం చెల్లించుకున్నాం. ఈ మ్యాచ్‌లో తెవాటియా, జోఫ్రా ఆర్చర్ బాగా రాణించారు. కానీ ఇతర ఆటగాళ్ల నుంచి మద్దతు కరువైనందున ఓటమి తప్పలేదని’ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు.
Also Read : SRH Playoffs: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అంత ఈజీ కాదు!
దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పై 60 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) విజయం సాధించింది. టాస్ నెగ్గి రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి కేవలం 131 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయంతో ఐపీఎల్ 2020 నుంచి నిష్క్రమించింది.
Also Read : Mumbai Indians: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ముంబై ఇండియన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe