Madhya Pradesh bypolls భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఉపఎన్నికల (Madhya Pradesh bypolls) హాడావిడి వాడీవేడిగా కొనసాగుతోంది. 3న జరగనున్న ఎన్నికల ప్రచారానికి నిన్నటితో తెరపడింది. అయితే 28 స్థానాలకు జరుగుతున్న ఈ ఉప ఎన్నికల పోరులో ఎలాగైనా గెలవాలన్న ఆకాంక్షతో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) ప్రచారం నిర్వహించాయి. ఈ క్రమంలో ఎప్పుడూ చలాకీగా ఉంటూ.. తనదైన స్టైల్లో మాట్లాడే బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింధియా (Jyotiraditya Scindia) పొరపాటున హస్తం గుర్తుకు (panja) ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ఈ మేరకు ఎంపీ కాంగ్రెస్ (MP Congress) ట్విట్ చేసి.. సింధియాజీ 3వ తేదీన ప్రజలు కచ్చితంగా కాంగ్రెస్‌కే ఓటు వేస్తారంటూ.. వీడియోను పంచుకుంది.
सिंधिया जी,
मध्यप्रदेश की जनता विश्वास दिलाती है कि तीन तारीख़ को हाथ के पंजे वाला बटन ही दबेगा। pic.twitter.com/dGJWGxdXad— MP Congress (@INCMP) October 31, 2020
బీజేపీ అభ్యర్థి ఇమార్తి దేవి (Imarti Devi) కి మద్దతుగా.. శనివారం దాబ్రాలో ఆ పార్టీ నేత జ్యోతిరాధిత్య సింధియా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సింధియా మాట్లాడుతూ.. 3 తేదీన హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ పొరపాటున అభ్యర్థిస్తూ.. కాంగ్రెస్ పేరును ప్రస్తావించబోయి ఆగిపోయారు. రెప్పపాటులోనే తన పొరపాటును గ్రహించిన ఆయన మళ్లీ పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఒకేసారి సింధియా ఈ విధంగా పేర్కొనడంతో.. ఆ పార్టీ అభ్యర్థితోపాటు ప్రజలు కూడా అవాక్కయి.. చిరునవ్వులు చిందించారు. Also read: MP Bypolls: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎమ్మెల్యే
ఇదిలా ఉంటే.. కమల్‌నాథ్‌తో వైరం ముదరడంతో.. జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనతోపాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ సీట్లతోపాటు.. మరో ఆరు స్థానాలకు కలిపి రాష్ట్రంలో మొత్తం 28 స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. Also read: Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe