/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) భారీ వర్షాల్నించి ( Heavy Rains ) తప్పించుకునేట్టు కన్పించడం లేదు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ( Bay of Bengal ) లో మరో ఆవర్తనం ఏర్పడిందిప్పుడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ, వాతావరణ శాఖ ( IMD ) రెండూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. ఉదయం వరకూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ( Heavy rains alert ) పడవచ్చని..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు పడనున్నాయి. ఉభయగోదావరి, కృష్ణా,గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదే విధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో పలుచోట్ల  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు పొంచి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. 

బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ ( Hyderabad )‌ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దాంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమై జన జీవనం స్తంభించింది. ఈ ప్రభావం నుంచి తేరుకోకముందే..బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికితోడు తూర్పు మధ్య అరేబియా, ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. మరోవైపు బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. రానున్న24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉండటంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెప్పింది.  Also read: AP: అత్యంత ఘనంగా తుంగభద్ర నది పుష్కరాలు, ప్రారంభమైన ఏర్పాట్లు

Section: 
English Title: 
Be careful, Heavy rains alert is ahead in andhra pradesh
News Source: 
Home Title: 

Heavy Rains Alert: భారీ వర్షాల ముప్పు ఇంకా పొంచి ఉంది, జాగ్రత్త

Heavy Rains Alert: భారీ వర్షాల ముప్పు ఇంకా పొంచి ఉంది, జాగ్రత్త
Caption: 
file photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Heavy Rains Alert: భారీ వర్షాల ముప్పు ఇంకా పొంచి ఉంది, జాగ్రత్త
Publish Later: 
No
Publish At: 
Saturday, October 17, 2020 - 21:25
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman