NEET 2020: సమాన మార్కులొచ్చినా ఒక్కరికే మొదటి ర్యాంకు

నీట్ 2020 ఫలితాల్లో కొత్త కోణం వెలుగుచూసింది. ఇద్దరికి పూర్తి మార్కులొచ్చినా సరే..ఒకరికే మొదటి ర్యాంకును ఎలా ప్రకటించారు? దీనికి కారణమేంటి?

Last Updated : Oct 17, 2020, 07:24 PM IST
NEET 2020: సమాన మార్కులొచ్చినా ఒక్కరికే మొదటి ర్యాంకు

నీట్ 2020 ( NEET 2020 ) ఫలితాల్లో కొత్త కోణం వెలుగుచూసింది. ఇద్దరికి పూర్తి మార్కులొచ్చినా సరే..ఒకరికే మొదటి ర్యాంకును ఎలా ప్రకటించారు? దీనికి కారణమేంటి?

నీట్ 2020 ఫలితాల్ని ( NEET 2020 Results ) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( National Testing Agency ) విడుదల చేసింది. ఈ పరీక్షా ఫలితాలు విడుదలైన సందర్భంగా వెలుగుచూసిన కొత్త కోణం ఆశ్యర్యపరుస్తోంది. ఇద్దరికీ సమాన మార్కులు, పూర్తి మార్కులొచ్చినా ఒక్కరికే మొదటి ర్యాంకు ప్రకటితమైంది.

అక్టోబర్ 16న అంటే శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఢిల్లీకు చెందిన ఆకాంక్ష సింగ్ కు 720 కు 720 మార్కులొచ్చాయి. అదే సమయంలో ఒడిశాకు చెందిన షోయబ్ ఆఫ్తాబ్ కు కూడా అంతే మార్కులొచ్చాయి. మార్కుల విషయంలో ఇద్దరికీ టై అయింది. మరి ర్యాంకు ఎవరికి ప్రకటించాలనేది ప్రశ్నగా మారింది. ఢిల్లీకు చెందిన ఆకాంక్ష కంటే..ఒడిశాకు చెందిన షోయబ్ ఆఫ్తాబ్ వయస్సు ఎక్కువ కావడంతో...షోయబ్ ఆఫ్తాబ్ నే తొలి ర్యాంకర్ గా ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.

నిబంధనల ప్రకారం ఇద్దరు అభ్యర్దులకు ఒకే విధంగా మార్కులు వచ్చినప్పుడు టై బ్రేకింగ్ విధానంలో అభ్యర్దుల వయస్సు, సబ్జెక్టుల పరంగా మార్కులు, తప్పుడు సమాధానాల్ని పరిగణలో తీసుకుంటారు సహజంగా.  అయితే ఈ అన్ని విభాగాల్లో ఇద్దరికీ సమానంగా మార్కులు వచ్చాయి. దాంతో షోయబ్ ఆఫ్తాబ్ ను వయస్సు ఎక్కువనే కారణంతో నీటి టాపర్ ( NEET Topper ) గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఆకాంక్షకు రెండవ ర్యాంక్ కేటాయించింది.

సెప్టెంబర్ 13న జరిగిన నీట్ పరీక్షకు 13 లక్షల 66 వేల 945 మంది హాజరయ్యారు. కరోనా వైరస్ కారణంగా పరీక్ష హాజరుకాలేకపోయిన వారికి మరోసారి  పరీక్ష నిర్వహించారు. Also read: Good News: ప్రైవేట్ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త!

Trending News