అమెరికా ( America ) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవలే కరోనావైరస్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. వైద్యులు కూడా ట్రంప్ చికిత్స పూర్తియింది అని తెలిపారు. దీంతో నవంబర్ నెలలో జరగాల్సిన ఎన్నికల కోసం ట్రంప్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంలో నిమగ్నం అయ్యారు.
Also Read | North Korea: నిండుసభలో కన్నీళ్లు పెట్టుకున్న కొరియా నియంత
ఓర్లాండో రాష్ట్రంలోని సాన్‌ఫోర్ట్‌లో ఆయన ఒక సభలో పాల్గొన్నారు. కోవిడ్-19 ( Covid-19 ) వల్ల సుమారు 10 రోజుల పాటు ప్రచారానికి దూరంగా ట్రంప్ ఈ సభతో ఆ లోటును భర్తీ చేయడానికి ప్రయత్నించారు.
సభలో మాట్లాడుతూ...తను కరోనావైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాను అని.. రోగ నిరోధక శక్తి మరింత పెరిగింది అని తెలిపారు. అందుకే ఇప్పుడు తను శక్తివంతుడిగా ఫీల్ అవుతున్నట్టు సభలో ఉన్నవారిని ఉద్దేశించి తెలిపారు ట్రంప్ ( Donald Trump ).
తను ఎప్పటిలాగే యాక్టీవ్ గా నడవగలను అని..సభలో ఉన్నవాళ్లకు ముద్దులు కూడా పెట్టగలను అని చమత్కరించారు. ఇటీవలే కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా నెగెటీవ్ అని తేలడంతో ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మరింత వేగం చూపే అవకాశం ఉంది.
ALSO READ | Big Boss 4: గంగవ్వ బయటికి వెళ్లడానికి కారణం అదేనా ?
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR